Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What happens if you eat parotas daily? Myths and facts about maidapindi

పరోటాలు రోజూ తింటే ఏమవుతుంది?మైదాపిండిపై ఉన్న అపోహలు, వాస్తవాలు

What happens if you eat parotas daily? Myths and facts about maidapindi

 మైదా పిండి అనగానే చాలామందికి పరోటా గుర్తొస్తుంది.

పరోటాల్లోనే కాదు మనం రోజూ తినే చాలా ఆహార పదార్థాల్లో మైదా ఉంటుంది.

పిజ్జా, బర్గర్, పాస్తా, నూడుల్స్ వంటివి మైదాతోనే తయారవుతాయి.       కేక్స్‌తో పాటు బాదుషా, గులాబ్ జామున్, జిలేబీ, సోన్ పాప్డి వంటి స్వీట్లు మైదా లేకుండా తయారు చేయలేం.

సాయంత్రం వేళ టీ తాగుతూ మనం తినే బిస్కెట్లు, సమోసాలు, పకోడి, రస్క్ వంటి వాటిలోనూ మైదా ఉంటుంది.

చివరికి చాలా ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే బ్రెడ్ కూడా మైదాతోనే తయారు చేస్తారు.

అంటే రోజూ మనం ఏదో ఒక రకంగా మైదా తింటుంటాం అన్నమాట.

మైదా ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది చెబుతుంటారు. ఇది నిజమేనా? మైదాలో ఏముంటాయి? గోదుమ, మైదా, రవ్వ అన్నీ ఒకటేనా? మైదాతో చేసిన పదార్థాలను ఎవరు తినకూడదు?   

1. మైదా ఎలా తయారవుతుంది?

మైదా ఆరోగ్యానికి మంచిదా కాదా అని తెలుసుకునే ముందు అసలు మైదా ఎలా తయారు చేస్తారో చూద్దాం. దీని గురించి మేం కొందరిని అడిగాం.

''మైదాను టాపియోకా (కసావా దుంపతో చేసే పిండి) స్టార్చ్ నుంచి తయారు చేస్తారు. పరోటా తినేవాళ్లెవరైనా ఈ విషయం చెబుతారు'' అని ఒకరు అన్నారు.

''మైదాను టాపియోకా పిండితో చేస్తారు. కేరళలో టపియోకాను కప్పకకిగంగు అని పిలుస్తారు. అందుకే కేరళలో పరాటా చాలా ఫేమస్'' అని మరొకరు చెప్పారు.

''మైదా ఎలా తయారైనప్పటికీ, ఆరోగ్యానికైతే మంచిది కాదు'' అని సమోసా తింటున్న మరో యువకుడు అన్నారు.

''గోదుమ వ్యర్థాల నుంచి మైదాను తయారు చేస్తారు. గోదుమ వ్యర్థాలకు రసాయనాలను కలిపి మైదాను తయారు చేస్తారు'' అని ఒక మహిళ వివరించారు.

వీళ్లు తమకు తెలిసిన విషయాలు చెప్పారు. కానీ దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు?

ఈ విషయం తెలుసుకోవడానికి మేం పీడియాట్రీషియన్, న్యూట్రీషియన్ కన్సల్టెంట్ అరుణ్ కుమార్‌ను సంప్రదించాం.

''బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు.

అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్‌తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్‌ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారు.'' అని పీడియాట్రీషియన్, న్యూట్రీషియన్ కన్సల్టెంట్ అరుణ్ కుమార్‌ వివరించారు.

రవ్వకు, మైదాకు పెద్ద తేడా ఏమీ ఉండదని ఆయన చెప్పారు.

''బ్రాన్‌ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంటర్నెట్‌లో ఉన్న తప్పుడు సమాచారం చదివి ప్రజలు మైదా గురించి ఎక్కువగా భయపడుతుంటారు'' అని ఆయన అన్నారు.

 DRARUNKUMAR/FACEBOOKపీడియాట్రిషీయన్, న్యూట్రీషన్ కన్సల్టెంట్ అరుణ్ కుమార్

2. మైదాకు తెలుపు రంగు ఎలా వస్తుంది?

గోదుమలను బాగా మెత్తగా పట్టిస్తే మైదా వస్తున్నప్పుడు, మైదాకు బ్రౌన్ రంగు కాకుండా తెలుపు రంగు ఎలా వస్తుంది?

మైదాకు తెలుపు రంగు రావడం కోసం రసాయనాలు కలుపుతారా? అని డాక్టర్ అరుణ్ కుమార్‌ను అడిగాం.

''మైదా తెలుపు రంగులో కనిపిస్తుంది. బ్రెడ్, బన్, కేక్స్, బిస్కెట్లు, పరోటాలు మైదా నుంచే తయారవుతాయి. కరకరలాడే గుణం కారణంగా మైదాను ఆహారపదార్థాల తయారీలో ప్రధానంగా వాడుతున్నారు.

మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్‌ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు.

బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి.

బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు'' అని డాక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.

3. మైదాతో షుగర్ వస్తుందా?

మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు. దీని గురించి డాక్టర్ అరుణ్ కుమార్ వివరించారు.

''మైదాలో అలోక్సాన్ రసాయనం ఉందని, దానివల్ల డయేరియా వస్తుందని, కాబట్టి మైదాను నిషేధించాలని కోరుతూ ఒక వ్యక్తి 2016లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన హైకోర్టు, మైదాతో చేసిన ఆహారపదార్థాలను తనిఖీ చేయాలని ఆహార విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. ఆహార శాఖ చేసిన తనిఖీల్లో మైదాలో ప్రమాదకర రసాయనాలు లేవని నిర్ధరణ అయింది.

అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్‌గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది.

అధ్యయనాల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనది. కాబట్టి ఈ రెండింటిని పోల్చకూడదు. అలా అయితే, రోజూ బిస్కెట్లు, పరోటాలు తినే అందరికీ షుగర్ వచ్చి ఉండాల్సింది కదా'' అని డాక్టర్ అరుణ్ కుమార్ వివరించారు.

మైదాలో పిండిపదార్థం అధికంగా ఉండి, ఫైబర్ తక్కువగా ఉన్నందున తాను మైదాను ఇష్టపడను అని ఆయన చెప్పారు. అశాస్త్రీయ కారణాలతో మైదాను తినకుండా ఉండాల్సిన అవసరం లేదని ఆయన సూచిస్తున్నారు.

 BBCన్యూట్రీషనిస్ట్ తరిణి కృష్ణన్

4. మైదాలో ఏం ఉంటాయి?

''గోదుమతో తయారు చేసిన బ్రెడ్, బిస్కెట్లు, పరోటాలను మైదాతో చేసే ఆహార పదార్థాలకు నేడు ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కానీ, మీకు తెలియని అంశం ఏంటంటే ఈ గోదుమ పరోటాల్లో కూడా మైదాను కలుపుతారు.

కేవలం గోదుమలతో బ్రెడ్, బిస్కెట్లు వంటివి చేయలేం. వాటిని చేయాలంటే గోదుమ పిండికి ఎంతో కొంత మైదా కలపాల్సి ఉంటుంది.

అయితే, మైదాతో చేసిన రెండు పరోటాలు తినడం కంటే అయిదారు గోదుమ చపాతీలు తినడం ఆరోగ్యకరం. మైదాతో కూడిన ఆహారపదార్థాలను మితంగా తింటే మంచిది'' అని డాక్టర్ అరుణ్ కుమార్ చెప్పారు.

మైదాలో ఏయే పోషకాలు ఉంటాయి?

ఈ అంశంపై న్యూట్రిషనిస్ట్ తరిణి కృష్ణన్ వివరించారు.

''గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుంది'' అని చెప్పారు. 5. మైదా ఎవరు తినొచ్చు? ఎవరు తినకూడదు?

మామూలుగా మైదాతో చేసే ఆహార పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. పరోటాలకు ఎక్కువ నూనె వాడుతారు. మైదాతో చేసే చోలే బటూరే వంటకం చాలా ప్రసిద్ధి. దీన్ని నూనెలో వేపుతారు.

మైదాతో చేసే బిస్కెట్లు, స్నాక్స్ అన్నింటిలో అదనంగా చక్కెర, నూనె కలుపుతారు. పిండిపదార్థం అధికంగా ఉండే మైదాకు ఇలాంటి వాటిని కలిపితే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది'' అని తరిణి కృష్ణన్ తెలిపారు.

డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినకూడదని ఆమె సూచించారు.

''పీచుపదార్థం లేని మైదాతో చేసిన ఆహారాలను కొద్దిగా తీసుకున్నా రక్తంలోని చక్కెర స్థాయిలు వెంటనే పెరుగుతాయి. ఒబెసిటీ ఉన్నవారు కూడా వీటికి దూరంగా ఉండాలి.

ముఖ్యంగా అధిక బరువు ఉన్న మహిళలు మైదా పదార్థాలను తినకూడదు. వీటిని తింటే మరింత బరువు పెరుగుతారు. రుతుక్రమం ఆలస్యంగా రావడం మొదలు అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని ఆమె వివరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What happens if you eat parotas daily? Myths and facts about maidapindi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0