AP Sarkar shock to the employees at the time of election
AP Govt: ఎన్నికల వేళ ఉద్యోగులకు ఏపీ సర్కార్ షాక్
ఎన్నికల సమయంలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో.. అపార్టమెంట్‌లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల సమయంలో (AP Elections 2024) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (AP Government) కరెంట్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం కల్పించిన అకామిడేషన్‌లో కరెంటు బిల్లులు ఎక్కువ రావడంతో.. అపార్టమెంట్‌లలో ఉన్న వారి వద్ద నుంచే వసూలు చేయాలంటూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సెక్రటేరియట్, అసెంబ్లీ, విభాగాధిపతి కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి షేరింగ్‌పై ప్రభుత్వం అకామిడేషన్ ఇస్తున్న విషయం తెలిసిందే. వీరు ఉంటున్న ప్లాట్‌ల విద్యుత్ బిల్లులు పరిమితికి మించి వస్తుండడంతో బిల్లులు చెల్లించాలని జీఏడీ అకామిడేషన్ విభాగాన్ని విద్యుత్ శాఖ కోరింది.
ఈ క్రమంలో పరిమితికి మించి 2లక్షల 79వేల 23 రూపాయలు విద్యుత్ వాడిన ఉద్యగులకు జీఏడీ అకామిడేషన్ విభాగం షాక్ ఇచ్చింది. ఇచ్చిన పరిమితికి మించి విద్యుత్ వినియోగించుకున్న ఉద్యోగులకు ప్రభుత్వం బిల్లు చెల్లించదని స్పష్టం చేసింది. పరిమితికి మించి వచ్చిన విద్యుత్ బిల్లులను ఆయా ప్లాట్‌లలో ఉన్న ఉద్యోగుల నుంచే వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో వారి విద్యత్ కనెక్షన్ తొలగించే ప్రమాదం ఉందని పేర్కొంటూ సర్వీస్ అసోషియేషన్‌లకు ప్రభుత్వం తరపు నుంచి లేఖ రావడం ఉద్యోగులకు షాక్ గురయ్యేలా చేసింది.
0 Response to "AP Sarkar shock to the employees at the time of election"
Post a Comment