We Love Reading Summer Activities
We Love Reading Summer Activities ( Class 6 - 10) 28.05.24
Day-35
Class 6-10 We Love Reading Summer Activities 28.05.2024.
Class 6-9 We Love Reading: తెలుగు కథ : బంగారు గుడ్ల కోడి
ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్ట పడిన పాపం ఎక్కువ సంపాదించలేక పోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసి పోతూ ఉండేవాడు.
ఒక రోజు అలాగే పొలం నుంచి అలిసి పోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ వుండగా దారిలో సూర్యాస్తమం అవుతోందని, ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్ర పోవటానికి అనుమతిని కోరాడు.
శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు. చేతులు, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఇన్న ఓకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేసాడు. తన దుప్పటి, తలగడ కూడా మంచం మీద వేసాడు.
తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం గింజల తోనే అన్నం వండి, బాటసారికి వడ్డించి, తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేసాడు.
కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు.
“ఈ కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఇక పైన నీకు ఈ పేదరికం ఉండదు.” అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు.
ఆరోజు నుంచి శివకాశి దాస మారింది. రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని, దానితో జీవితం కొనసాగాడు. వంటి మీద ఉన్న పాత, చిరిగి పోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు.
పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు. పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పూట పంచ పక్ష పరవాన్నాలు తినేవాడు. పొలం పనులు బొత్తిగా మానేసాడు.
పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది. ఆలోచనా మారుతుంది. పని తక్కువా, డబ్బు ఎక్కువా ఉండే సరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి. ఒక్క సారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి యెంత డబ్బూ సరిపోదు. ఇంకా, ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుందే.
ఇదేశివకాశి కి కూడా అయ్యింది. ఒకప్పుడు ఏమి లేకపోయినా సంతోషంగా వున్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు. కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదిన్చేయాలనే కాంక్ష మొదలైంది. గతం మర్చి పోయాడు.
రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటే సారి కోడిలోంచి గుడ్లున్ని తీసేస్తే, ఒకటే సారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది.
ఉండపట్ట లేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేసాడు. పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశి కి ఒక షాక్ తగిలింది. కోడి పొట్టలో ఏమి లేదు. లోపల మామూలు కోడి లానే వుంది.
మొదటికే మోసం వచ్చింది.
అయ్యో! ఎందుకు దురాశ పడ్డాను! అని శివకాశి అప్పుడు బాధ పడ్డాడు. కాని ఏమి లాభం? రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు.
Class 6-9 We Love Reading: English : Farmer and Golden Duck
Class 6-9 We Love Reading: Maths: Areas Using Graph
0 Response to "We Love Reading Summer Activities"
Post a Comment