Central Bank of India Recruitment 2024
Central Bank of India పదో తరగతి అర్హతతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 పోస్టులు.
Central Bank of India Recruitment 2024 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ (HCM) డిపార్ట్‌మెంట్.
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకుల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 21 నుంచి ప్రారంభంకాగా.. జూన్ 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 484
పోస్టులు : సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్
అర్హతలు : గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి పదో తరగతి (SSC) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
వయసు : 2023 మార్చి 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు : రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగులు, ఈఎస్ఎం, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.175 చెల్లించాలి.
శిక్షణ కాలం : ఏడాది
జీతం : రూ.19,500 – రూ.37,815 వరకు
దరఖాస్తులకు చివరితేదీ : 27.06.2024
పరీక్ష తేదీ : 2024 జులై/ ఆగస్టు
వెబ్‌సైట్ : https://nats.education.gov.in/
0 Response to "Central Bank of India Recruitment 2024 "
Post a Comment