Implementation of Free Bus for Women in AP - Big Update
ANDHRAPRADESH ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు - బిగ్ అప్డేట్.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సవాల్ గా మారుతున్నాయి. సూపర్ సిక్స్ తో పాటుగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముందుగా రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో మహిళలకు ఉచిత బస్సు హామీ అమలు పైన ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
ఏపీలో అమలు దిశగా
తెలంగాణ, కర్ణాటక తరహాలోనే ఏపీలోనూ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది ఒకటిగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కొలువు తీరుతోంది. ఇచ్చిన హామీల్లో వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న వాటి పైన ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఖజనా పైన పడుతున్న భారం, లాభ – నష్టాల పైన ఫోకస్ చేసారు. ఏపీలో ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం అయింది. ఇక..రోజు వారీ బస్సుల్లో మహిళల ప్రయాణ వివరాల పైన నివేదిక కోరారని సమాచారం.
0 Response to "Implementation of Free Bus for Women in AP - Big Update"
Post a Comment