Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pemmasani ChandraSekhar

 నాడు స్టడీ మెటీరియల్ అమ్మి నేడు మోడీ గారి క్యాబినెట్ లో

ఎన్నికల ముందు వరకు ఏపీలో చర్చంతా ఆయన గురించే.. నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల పోలింగ్ పూర్తయ్యే వరకు గుంటూరు లోక్‌సభ స్థానం అందరి దృష్టిని ఆకర్షించింది.

అమెరికాలో పెద్ద వైద్యుడిగా పేరు సంపాదించిన ఆయన ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అయినాసరే ఆయన గురించి పెద్దగా చర్చలేదు. కానీ నామినేషన్ వేసిన తర్వాత అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి వేలకోట్లకు అధిపతి కావడంతో ఏపీ రాజకీయాల్లో పెమ్మసాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అంతేకాదు.. రాజకీయ సభల్లో ఆయన ప్రసంగాలు ప్రజలందరినీ ఆకట్టుకునేవి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఎన్నికలు ముగిసాయి.. ఫలితాలు వచ్చాయి.. గుంటూరు ఎంపీగా పెమ్మసాని గెలుపొందారు. ఇక అక్కడితే అయిపోయిందనుకున్నారంతా.. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా పెమ్మసాని పేరు చర్చనీయాంశమవుతోంది. ఎంపీగా గెలిచిన ఆయనకు అదృష్టం కలిసొచ్చి మోదీ కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. టీడీపీ ఎన్డీయే భాగస్వామ్యపక్షంగా ఉండటంతో.. ఆ పార్టీకి తొలి విడతలో రెండు మంత్రి పదవులు దక్కాయి. వీరిలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసానికి అవకాశం దక్కింది. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ ఎంపీ కావడంతో పాటు టీడీపీలో సీనియర్ నేత కావడంతో ఆయనకు కేంద్రమంత్రి పదవి ఖాయమైంది. కానీ అనూహ్యంగా మొదటిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఎంపీ పదవి దక్కడంతో ఆయన ఐశ్వర్యవంతుడే కాదు.. అదృష్టవంతుడనే చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి ఏపీలో 16మంది ఎంపీలు గెలవగా.. తొలివిడతలో ఇద్దరికి అవకాశం దక్కడం.. ఆ ఇద్దరిలో పెమ్మసానికి కేంద్రమంత్రి పదవి రావడంతో ఆయనకు అదృష్టం కలిసొచ్చిందనే చర్చ సాగుతోంది.

దేశ వ్యాప్తంగా చర్చ.

ఎంపీల్లో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధి ఆస్తి రూ.5,300 కోట్ల రూపాయిలు. తాజాగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తుల విలువ రూ.5,705కోట్లు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అత్యంత ఐశ్వర్యవంతుడైన ఎంపీగా పెమ్మసాని ఉన్నారు. అంతేకాదు కేబినెట్‌లో చోటు దక్కడంతో మోదీ మంత్రిమండలిలో ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పెమ్మసాని నిలిచారు. దీంతో పెమ్మసాని ఆస్తుల గురించి తెలుసుకుని అంతా ఆశ్చర్యపోతున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని దేశ ప్రజలు గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. ఓ డాక్టర్ వేలకోట్ల రూపాయిలకు ఎలా అధిపతి అయ్యారనేది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మొత్తం ఆస్తులు.

ప్రస్తుత గణాంకాల ప్రకారం రాజ్యసభ, లోక్‌సభలకు పోటీచేసిన అభ్యర్థులలో అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్. తన పేరుతో రూ.2,316,54,45,165, తన భార్య శ్రీరత్న కోనేరు పేరుతో రూ.2,289,35,36,539, కుమారుడు అభినవ్‌ పేరుమీద రూ.496,27,61,094, కుమార్తె సహస్ర పేరుతో రూ.496,47,37,988 ఆస్తులున్నట్లు ఆయన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇవికాక.. తన పేరుతో రూ.72 కోట్ల విలువైన భూములు, భవనాలు, తన భార్య పేరుతో రూ.34 కోట్ల 82 లక్షల విలువైన భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. చేతిలో రూ.2,06,400లు.. భార్య దగ్గర రూ.1,51,800 నగదు ఉన్నాయని, కుమారుడు అభినవ్ వద్ద రూ.16,500, కుమార్తె సహస్ర వద్ద రూ.15,900 నగదు ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు. ఓ రైతు కుటుంబానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం.

సామాన్యుడిగా.

గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటా లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు. బాల్యంలో కొంతకాలం పాటు నరసరావుపేటలో ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు. 1991 లో పదోతరగతి, 1993లో ఇంటర్ పూర్తిచేస్తారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో1993-94లో ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌లో 27వ ర్యాంకు సాధించి హైదరాబాద్‌ ఉస్మానియాలో సీటు సాధించారు. ఓ సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు. అక్కడ తన ప్రతిభతో వ్యాపారం రంగంలో రాణించి నేడు కోట్ల రూపాయిలకు అధిపతి అయ్యారు. కేవలం కోట్లు సంపాదించడమే కాదు.. తన సంపాదనలో కొంత భాగాన్ని పేద ప్రజల కోసం వినియోగిస్తూ విరివిగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను పుట్టిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.

అమెరికాకు వెళ్లి..

ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం 2000 సంవత్సరంలో అమెరికాకు వెళ్లారు. పీజీ పూర్తి చేసిన అనంతరం అక్కడే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఐదేళ్లపాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు. మరోవైపు మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు సహాయం చేసేవారు. తనలా వైద్య విద్య అభ్యసించాలన్న ఎంతో మంది కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తాను సొంతంగా తయారు చేసిన నోట్స్‌ను తక్కువ ధరకు ఆన్ లైన్‌లో అందించేవారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రయత్నానికి మంచి ఆదరణ లభించింది. అదే సమయంలో చంద్రశేఖర్ రాసిన మెటీరియల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో విద్యార్థుల కోసం యూ వరల్డ్‌ ఆన్‌లైన్‌ ట్రైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నర్సింగ్‌, ఫార్మసీ, లా, వాణిజ్యం, అకౌంటింగ్‌ విభాగాల్లో లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. వారికి అద్భుతమైన మెటీరియల్ అందించేవారు. అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఇప్పటికీ వైద్య పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులకు యు వరల్డ్ ద్వారా ఆయన శిక్షణ అందిస్తున్నారు. ఈ వ్యాపారం ద్వారా ఆయన కోట్ల రూపాయిలను సంపాదించగలిగారు.

సేవా కార్యక్రమాలు

చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్ లో సభ్యుడిగా ఉంటూ.. పెమ్మసాని ఫౌండేషన్‌ ను ఏర్పాటు చేసి ఎన్నారైలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారు. తన వ్యాపారంలో రాణించిన ఆయన పురిటి గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి తిరిగి వచ్చారు. పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు. దీనికోసం సొంత డబ్బులతో వందల సంఖ్యలో బోర్‌వెల్స్‌, ఆర్‌వోప్లాంట్స్‌ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా బెస్ట్ బెరీ స్కూల్‌ను ప్రారంభించారు. పెమ్మసాని ట్రస్టు ఏర్పాటు చేసి.. పేద ప్రజలకు, స్వచ్చంద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన గుంటూరు లోక్‌సభ స్థానంనుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pemmasani ChandraSekhar"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0