Lifting the limit of seats in engineering courses! Who benefits? Loss to whom?
ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్ల పరిమితి ఎత్తివేత!
ఎవరి కి లాభం.? ఎవరి కి నష్టం.?
2024–25 విద్యా సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ సీట్ల పరిమితిని ఎత్తివేసింది ఏఐసీటీఈ. దీంతో ఎంతమంది విద్యార్థులైనా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ కోర్సులో చేసిన ఈ మార్పుపై పూర్తి వివరణ.
ఇంజినీరింగ్ కోర్సులో అపరిమితంగా సీట్లు భర్తీ చేసుకునేలా ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) ఉత్తర్వులు జారీ చేసింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితిని ఎత్తివేసింది. కళాశాల యాజమాన్యాలు అదనపు బ్రాంచులకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు కోర్సుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తుండడంతో చాలా కళాశాలలు దరఖాస్తు చేశాయి. కొన్ని కళాశాలలకు ఇప్పటికే అనుమతి లభించింది.
నూతన విద్యా విధానానికి అనుగుణంగా
ఇప్పటి వరకు ఉన్న విద్యా విధానం ప్రకారం ఒక్కో బ్రాంచ్‌లో గరిష్టంగా 240 సీట్లకే పరిమితి ఉంది. అయితే, నూతన జాతీయ విద్యా విధానం–2020కు అనుగుణంగా ఈ పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (స్థూల ప్రవేశాల నిష్పత్తి), డిమాండ్ మేరకు సీట్లు పెంచుకోవచ్చు.
జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో ఇప్పటికే 89 ఇంజినీరింగ్ కళాశాలలు దరఖాస్తు చేయగా, 75 కళాశాలలకు ఏఐసీటీఈ గుర్తింపు లభించింది. తక్కిన 14 ఇంజినీరింగ్ కళాశాలలకు గుర్తింపు రావాల్సి ఉంది. మౌలిక సదుపాయాల పరిశీలనకు ఏఐసీటీఈ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాలను అమలు చేస్తోంది. కంప్యూటర్ సైన్సెస్ (సీఎస్‌ఈ) బ్రాంచ్‌కు డిమాండ్ అధికంగా ఉండడంతో కళాశాలలన్నీ దాదాపుగా ఇందులోనే అదనపు సెక్షన్లకు దరఖాస్తు చేశాయి. కొన్ని సీఎస్‌ఈతో పాటు ఈసీఈకి అనుమతి తీసుకుంటున్నాయి.
పెరగనున్న కన్వీనర్ కోటా
ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఇప్పటికే సీట్లు అధికంగా ఉన్నాయి. అయితే, ఒక్కో కళాశాలలో 1,000 సీట్లు ఉంటే, ఇందులో 650 కంప్యూటర్ సైన్సెస్, వాటి అనుబంధ కోర్సుల్లోనే ఉన్నాయి.కంప్యూటర్ సైన్సెస్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. తల్లిదండ్రులు బలవంతంగా కంప్యూటర్ సైన్సెస్ కోర్సులో చేరేలా విద్యార్థులను ప్రేరేపిస్తుండడంతో అయిష్టంగానే తీసుకుంటున్నారు. మరికొన్ని కళాశాలలు కంప్యూటర్ సైన్సెస్‌లో అదనపు సెక్షన్లకు అనుమతి తీసుకుంటున్నాయి. ఈ దఫా ఏఐసీటీఈ అదనపు సెక్షన్లు ఇవ్వనుండడంతో కన్వీనర్ కోటా కింద సీట్లు మరింత పెరగనున్నాయి.
అధునాతన కోర్సుల్లోనూ
ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు అధునాతన కోర్సుల్లోనూ సీట్లు పెంచుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి వాటిల్లోనూ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎమర్జింగ్ కోర్సుల్లో ఉద్యోగావకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉండటం, విద్యార్థుల నుంచి డిమాండ్ వస్తుందనే ఉద్దేశంతో కొన్ని కళాశాలలు సీఎస్‌ఈలో వీటిని తీసుకొచ్చాయి. మరికొన్ని కళాశాలలు సీఎస్‌ఈతో సంబంధం లేకుండా నేరుగా బ్రాంచ్‌లు నిర్వహించేందుకు ముందుకువచ్చాయి.
PAAP రివ్వూ.లాభాలు ఎవరి కి.?
ఇంజనీరింగ్ విద్య వ్యాపారులకు పండగే.ఎందుకు అంటే కన్వీనర్ కొటా లో సీట్లు పెరగడం. డిమాండ్ పెంచి ఎక్కువ ధరకు అమ్ముకుంటారు ఇది యాజమాన్యాలకు లాభంకంప్యూటర్ సైన్స్ గ్రూప్ లో కన్వీనర్ కోటా ధరలు తగ్గుముఖం పడుతుంది ఇది విద్యార్థులకు లాభం ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి
నష్టం ఎవరి కి?
దీని వలన ఇంజనీరింగ్ విద్య డిగ్రీ విద్య ల దెబ్బ తింటుంది.విద్య వ్యాపార కోచింగ్ సెంటర్ లలో అరవ తరగతి విద్యార్థులను హింసకు గురి చేస్తె ముద్దు పేర్లతో పలిచే తరగతుల కు డిమాండ్ తగ్గుతుంది.ఇంజనీరింగ్ కళాశాల లు దాదాపు మూత పడతాయి.విద్య శిక్షణ సదుపాయాలు ఉండే కళాశాలకు డిమాండ్ పెరిగుతుంది .
PAAP .. డిమాండ్... ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ కళాశాల లలో ఎక్కువ డిమాండ్ ఉండే బ్రాంచి లలో మిగిలిన బ్రాంచ్ లలో.ఇంజనీరింగ్ విద్య వ్యాపార కళాశాల లకు ధీటుగా సీట్లు సంఖ్య పెంచాలని ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాము..
.ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ.
0 Response to "Lifting the limit of seats in engineering courses! Who benefits? Loss to whom?"
Post a Comment