Big shock for Google Chrome users.
Google Chrome గూగుల్ క్రోమ్ వాడే వారికి బిగ్ షాక్ .దీనికి సంబంధించి భారత ప్రభుత్వ భద్రతా సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. వివరాలు.
ప్రముఖ వెబ్ బ్రౌజర్ Google క్రోమ్ (Google Chrome) ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ బ్రౌజర్‌ను కోట్ల మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరూ పెద్ద రిస్క్‌లో పడ్డారు.
Google క్రోమ్ యూజర్ల డివైజ్‌లు హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ భద్రతా సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఒక ముఖ్యమైన సెక్యూరిటీ అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్‌కి ఎక్కువ ర్యాంకింగ్ ఇచ్చింది, అంటే మిలియన్ల కొద్దీ క్రోమ్ యూజర్లు తక్షణం అప్రమత్తం కావాలి.
ఈ హెచ్చరికపై క్రోమ్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సెక్యూరిటీ రిస్క్ ఏంటి? ఎవరు ప్రభావితం అవుతారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎవరు ప్రభావితం అయ్యారు
విండోస్ (Windows), మ్యాక్ (Mac), లైనక్స్ (Linux) ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో క్రోమ్ బ్రౌజర్ వినియోగించే యూజర్లపై ప్రభావం ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న పర్సనల్ కంప్యూటర్స్‌లో ఇమెయిల్స్ ఓపెన్ చేయడం, లింక్స్ నుంచి డౌన్‌లోడ్ చేయడంపై జాగ్రత్తగా ఉండాలి.
సమస్య ఏంటి?
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) సెక్యూరిటీ బులెటిన్‌లో, క్రోమ్ కాంపోనెంట్స్‌లో చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. V8లో ఇనప్రాప్రియేట్ ఇంప్లిమెంటేషన్, V8లో టైప్ కన్‌ఫ్యూజన్, V8లో అవుట్ ఆఫ్ బాండ్స్ మెమరీ యాక్సెస్, యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ స్క్రీన్ క్యాప్చర్, మీడియా స్ట్రీమ్, ఆడియో,
నావిగేషన్‌లో ఇష్యూస్ ఉన్నట్లు తెలిపింది. అలానే DevToolsలో రేస్ కండిషన్ ఎర్రర్ కారణంగా సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. గూగుల్ క్రోమ్‌లో ఈ మల్టిపుల్ వల్నెరబిలిటీస్ ఎటాకర్స్‌కి మేలు చేస్తాయని, రిమోట్‌గా పర్సనల్ కంప్యూటర్స్‌ని యాక్సెస్ చేసే అవకాశం కల్పిస్తాయని స్పష్టం చేసింది.
ఏ క్రోమ్ వెర్షన్స్ ఎఫెక్ట్ అయ్యాయి?
- CERT-In అలర్ట్‌లో కింది గూగుల్ క్రోమ్ వెర్షన్లు సెక్యూరిటీ రిస్క్‌ల ద్వారా ప్రభావితమవుతున్నాయని పేర్కొంది:
- విండోస్, మ్యాక్‌లో 126.0.6478.182/183 కంటే ముందు గూగుల్ క్రోమ్ వెర్షన్లు
- లైనక్స్‌లో 126.0.6478.182 కంటే ముందు Google క్రోమ్ వెర్షన్లు.
మీ డివైజ్ సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?
ఈ సెక్యూరిటీ రిస్కుల నుంచి మీ డివైజ్‌ను రక్షించడానికి, మీ Google క్రోమ్ బ్రౌజర్ అప్‌డేట్ చేయండి. లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయడం వల్ల ముప్పు తొలగిపోతుంది.
అప్‌డేట్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?
అప్‌డేట్ చేయడానికి పర్సనల్ కంప్యూటర్ లేదా లేదా మ్యాక్‌లో ముందుగా Google క్రోమ్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ టాప్‌లో కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్ చేసి, సెట్టింగ్స్‌కి వెళ్లండి. తర్వాత సెట్టింగ్స్ > అబౌట్ సెక్షన్‌కు వెళ్లాలి. క్రోమ్ ఆల్రెడీ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయుంటే, 'ఆల్రెడీ యూజింగ్ లేటెస్ట్ వెర్షన్' అని కనిపిస్తుంది. క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ కాకపోతే, 'చెక్ ఫర్ అప్‌డేట్స్' బటన్‌పై క్లిక్ చేయాలి. అందుబాటులో ఉన్న అప్‌డేట్స్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
0 Response to "Big shock for Google Chrome users."
Post a Comment