Budget 2024 Highlights
Budget 2024 Highlights: నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవిగో, ఏపీకి వరాల జల్లులు కురిపించిన కేంద్రం, ముద్రా రుణాల పరిమితి 20 లక్షలకు పెంపు, కేంద్ర బడ్జెట్ 2024 హైలెట్స్ ఇవే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
వరుసగా ఏడవ సారి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించారు. తద్వారా వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటి వరకూ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఆరు వార్షిక బడ్జెట్‌లు ప్రవేశ పెట్టిన రికార్డు నమోదైంది. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశ పెట్టారు.2019లో నరేంద్రమోదీ సారధ్యంలో రెండో దఫా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకూ వరుసగా ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లను కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.
ఉద్యోగం, నైపుణ్యం, ఎంఎస్ఎంఈ, మధ్య తరగతిపై ఈసారి బడ్జెట్‌లో ఫోకస్ పెట్టినట్లు మంత్రి తెలిపారు. 2025 వార్షిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌లో విద్య, ఉద్యోగం, నైపుణ్యం రంగాల కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు. ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించిన అనేక స్కీమ్‌లు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.తాత్కాలిక బడ్జెట్‌లో ఇచ్చిన ప్రాముఖ్యతలనే .. వికసిత్ భారత్ సాధన కోసం అమలు చేస్తున్నట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.
ఒక్కరికీ అవకాశం దక్కేలా చూస్తామన్నారు. వ్యవసాయం, ఉద్యోగం, నైపుణ్యం, హెచ్ఆర్డీ, సామాజిక న్యాయం, ఉత్పత్తి-సేవలు, పట్టణాభివృద్ధి, ఎమర్జెన్సీ సెక్యూర్టీ, మౌళిక సదుపాయాలు, ఆవిష్కరణ, ఆర్ అండ్ డీ, నెక్ట్స్ జనరేషన్ రిఫార్మ్స్ గురించి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా నైపుణ్యాభివృద్ధి సంస్థలను అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని తెలిపారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు చేస్తామని ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేల కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఏకంగా రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో విత్త మంత్రి వెల్లడించారు
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు అందజేస్తామని తెలిపారు. అదే విధంగా ఏపీ ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం పూర్తి చేయడానికి కూడా అన్ని విధాల సాయం చేస్తామని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
అలాగే బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు క్రెడిట్ సపోర్టును ప్రకటించారు మంత్రి సీతారామన్. ముద్రా రుణాల(Mudra loans) పరిమితిని పది లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచుతున్నట్లు ఆమె చెప్పారు.జయవంతంగా రుణాలను చెల్లించిన వారికి పరిమితిని పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. తరుణ్ క్యాటగిరీలో ఈ వెసలుబాటు కల్పించనున్నారు.ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్ కల్పించేందుకు..
కొత్త రకం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారెంటీ ఫండ్ కింద ప్రతి ఖాతాదారుడికి వంద కోట్ల వరకు రుణం ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇర్రాడియేషన్ యూనిట్ల ఏర్పాటకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్స్ ను పీపీపీ మోడల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రతి సంవత్సరం 25వేల మంది విద్యార్థులకు సహాయం చేయడానికి మోడల్ స్కిల్ లోన్ స్కీమ్‌ను ప్రతిపాదిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.ఈ-వోచర్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం అందిస్తామని.. ప్రతి సంవత్సరం, దేశీయ సంస్థల్లో ఉన్నత విద్య కోసం లక్ష మంది విద్యార్థులకు 3శాతం వార్షిక వడ్డీతో నేరుగా రూ.10 లక్షల రుణం ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు.. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ.3 లక్షల కోట్లకు పైగా నిధుల కేటాయింపు పారిశ్రమలలో పనిచేసే కార్మికుల కోసం రెంటల్ సిస్టమ్‌లో డార్మిటరీ వసతి సౌకర్యం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకారం జిల్లాలకు వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీ బీహార్‌లో వివిధ రహదారుల ప్రాజెక్టుల కోసం రూ.26,000 కోట్లు కేటాయింపు పీపీపీ పద్ధతిలో బీహార్ అబివృద్ధికి ఆర్థిక సహాయం బీహార్‌లో విమానాశ్రయాలు, వైద్య కళాశాలలు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు 5 రాష్ట్రాల్లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక పథకం ఈశాన్య రాష్ట్రాల్లో వందకు పైగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ శాఖలు ఏర్పాటు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పథకం అమలు దేశ సమగ్రాభివృద్ధికి జాతీయ సహకార విధానం గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థులకు నేరుగా ఇ-వోచర్లను అందజేయడం ద్వారా మొత్తం రుణంపైమూడు శాతం వడ్డీ రాయితీ. అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో, బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి పూర్తి సహకారం రూ.26వేల కోట్ల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ చేసుకున్న లక్ష కంటే తక్కువ జీతం ఉన్న మొదటి సారి ఉద్యోగులకు 3 వాయిదాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ కింద ఒక నెల జీతంలో రూ. 15,000 వరకు ఇవ్వనున్నట్లు ప్రకటన రొయ్యల పెంపకం, మార్కెటింగ్ కోసం ఆర్థిక సహాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి అవకాశాలు వేగవంతంపై ప్రత్యేక దృష్టి ఆధ్యాత్మిక టూరింజకు పెద్దపీట, కాశీ తరహాలో గయ అభివృద్ధి , బీహార్ రాజ్ గిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక, టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి వరద నివారణకు బీహార్ కు రూ. 15 వేల కోట్లు, అలాగే అస్సాం, హిమాచల్ ప్రదేశ్ కు ప్రత్యేక నిధులు
0 Response to "Budget 2024 Highlights"
Post a Comment