Direct Job Without Written Test, Vijayawada Post Office Jobs. Explanation of how to apply.
రాత పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్, విజయవాడ పోస్టాఫీసులో ఉద్యోగాలు . ఎలా అప్లై చేసుకోవాలో వివరణ.
పదో తరగతి పాసై, ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త. పోస్టాఫీసులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడ పోస్టల్ డివిజన్ పరిధిలో 65 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
కేవలం పదో తరగతి అర్హతతోనే ఈ ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేంటి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
పోస్టాఫీసులలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో సుమారు 44వేల2వందల 28 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జీడీఎస్(గ్రామీణ డాక్ సేవక్) లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం) లేదా డాక్ సేవక్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
విజయవాడ డివిజన్‌లోని ఖాళీల వివరాలు
- గ్రామీణ డాక్ సేవక్- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ -22
- గ్రామీణ డాక్ సేవక్- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్- 41
- డాక్ సేవక్ - 02
మొత్తం ఖాళీలు - 65
https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/P01.aspx
అర్హతలు
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో గణితం మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులతో పదో తరగతి పాసై ఉండాలి.
- పదో తరగతిలో స్థానిక మాతృభాషను సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయాలనుకునే వారు తెలుగు సబ్జెక్టును పదో తరగతి వరకు చదివి ఉండాలి.
అదనపు అర్హతలు
- కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- సైకిల్ నడపడం వచ్చి ఉండాలి.
- స్థానికంగా నివసించి ఉండాలి.
వయసు అర్హతలు
- పోస్టాఫీసులో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస వయసు 18 సంవత్సరాలు
- గరిష్టంగా 40 సంవత్సరాల వయస్సు ఉండాలి.
- ఓబీసీలకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.
- ఎస్సీ మరియు ఎస్టీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయసు సడలింపు ఉంటుంది.
వేతనం
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి రూ.12వేల నుంచి రూ.29వేల 380 వేతనం పొందుతారు.
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగానికి రూ.10వేల నుంచి రూ24వేల 470 వరకు వేతనం పొందుతారు.
ఎంపిక ప్రక్రియ
- పోస్టాఫీసులోని ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించరు.
- పదో తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ సిద్దం చేస్తారు.
- మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక చేసిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి
- అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు పోస్టల్ శాఖవారి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
- దరఖాస్తు దారులు మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అయిన తర్వాత లాగిన్ అయ్యి ఫీజ్ పేమెంట్ చేయవచ్చు. ఆ తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://indiapostgdsonline.cept.gov.in/HomePageS/D20.aspx
దరఖాస్తు ఫీజు
- జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
- మహిళలు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
దరఖాస్తుకు చివరి తేది
06.08.2024 లోపు ఈ పోస్టాఫీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
0 Response to " Direct Job Without Written Test, Vijayawada Post Office Jobs. Explanation of how to apply."
Post a Comment