Clarification
కొండవీటి కమిటి ఉన్నత పాఠశాల, కొత్తరెడ్డిపాలెం, చేబ్రోలు మండలం వివరణ
నిన్న అనగా 15.07.2024వ తేదిన (సోమవారం) మా పాఠశాల 7వ తరగతి విద్యార్ధిని పేరుపోగు శైలజ ఆకస్మికంగా మరణించటం జరిగింది.
ఆ విద్యార్థిని నిన్నటి దినమున మా పాఠశాలకు అసలు హాజరు కాలేదు.
మా పాఠశాల హాజరు పట్టి యందు మరియు ఆన్ లైన్ హాజరు నందు కూడా సదరు విద్యార్థినికి గైర్హాజరు నమోదు చేయటం జరిగింది.
ఈ రోజు అనగా 16.07.2024వ తేదీన గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారిగారు మా పాఠశాలను సందర్శించి విచారించారు.
సదరు విద్యార్ధని పాఠశాలకు పూర్తిగా గైర్హాజరైన విషయమును, పాఠశాల హాజరుపట్టి మరియు ఆన్ లైన్ హాజరును పరిశీలించి, గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి ధృవీకరించుకొనటమైనది.
అలాగే మా ఉపాధ్యాయులందరిని విచారించటం కూడా జరిగినది.
వివిధ దినపత్రికల యందు ఈ అంశంపై వచ్చిన కధనాలలో సదరు విద్యార్ధిని పాఠశాలకు హాజరై, తిరిగి ఇంటికి వెళ్లుతున్నపుడు ఈ ఘటన జరిగినట్లుగా పేర్కొనటం జరిగినది.
కాని ఆ విద్యార్ధిని అసలు పాఠశాలకు హాజరు కానేలేదు.
ఈ ఘటనలో పాఠశాల తప్పిదం ఏమి లేదని తెలియజేస్తున్నాము.
0 Response to "Clarification "
Post a Comment