India Post GDS Recruitment Notification 2024 for 44228 Vacancies, Apply Online at indiapostgdsonline.gov.in before 5 August
India Post GDS Recruitment 2024
పోస్టాఫీసులలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో సుమారు 44,228 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రుభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా జీడీఎస్ లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం) లేదా డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జూలై 15 అంటే నేటి నుంచే ప్రారంభం అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5, 2024. 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
పోస్టుల వివరాలు:
- 1. బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం)
- 2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)
- 3. డాక్ సేవక్
మొత్తం పోస్టుల సంఖ్య: 44,228
తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య: ఆంధ్రప్రదేశ్- 1,355, తెలంగాణ- 981.
విద్యార్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
జీతభత్యాలు: నెలకు బ్రాంచ్ పోస్టు మాస్టర్ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్ బ్రాంచ్పీస్టు మాస్టర్/ డాక్ సేవక్ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్రిస్ట్ మార్కుల ఆధారంగా షార్టిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ,ఎస్టీ,పీడబ్లూడీ,ట్రాన్స్ఉమెన్ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. మిగిలిన వాళ్లు రూ.100 చెల్లించాలి.
అప్లయ్ చేయు విధానం :
- పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ www.indiapostgdsonline.gov.in ను ఓపెన్ చేయాలి
- తర్వాత అప్లై చేయాలనుకునే అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ కోసం.. అప్లికేంట్లకు సొంత మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఉండాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత లాగిన్ అయి ఫీజు పేమెంట్ చేయాలి.
- తర్వాత ఆసక్తి ఉన్న పోస్టులకు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
- అనంతరం అభ్యర్థి డివిజన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీ ఫొటో, సంతకాన్ని.. చెప్పిన ఫార్మాట్, సైజుల్లో అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
- చివరకు మీరు ఏ డివిజిన్‌కు అప్లై చేసుకున్నారో.. ఆ డివిజన్ హెడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ
సిస్టమ్ రూపొందించిన మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఉంటుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల జాబితా GDS పోర్టల్‌లో పెడతారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లకు SMS, ఈమెయిల్ ద్వారా రిజల్ట్స్,ఫిజికల్ వెరిఫికేషన్ డేట్ వంటి తదితర వివరాలను తెలియజేస్తారు. ఆ తర్వాత, షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కోసం నియమించబడిన అధికారి ఆఫీసుకు హాజరవ్వాల్సా ఉంటుంది.
వెబ్సైటు https://indiapostgdsonline.gov.in/
దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి
ముఖ్యమైన తేదీలు: -
దరఖాస్తు ప్రారంభ తేదీ : 15.07.2024
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024
దరఖాస్తు సవరణ తేదీలు : 06.08.24 నుండి 08.08.24 వరకు.
0 Response to "India Post GDS Recruitment Notification 2024 for 44228 Vacancies, Apply Online at indiapostgdsonline.gov.in before 5 August"
Post a Comment