Are you investing money in schemes like Sukanya Samriddhi and PPF? New rules from 1st
సుకన్య సమృద్ధి, పీపీఎఫ్ వంటి స్కీమ్స్‌లో డబ్బు పెడుతున్నారా..ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్
సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు దాచుకుంటున్నారా.. పోస్టాఫీస్, బ్యాంక్‌లలో ఉన్న పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే మీకు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. అందువల్ల డబ్బులు పెట్టే వారు కొత్త మార్పులు తెలుసుకోండి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్స్ ఎఫైర్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త రూల్స్ తీసుకువచ్చాయి. అందువల్ల సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.
స్మాల్ సేవింగ్ అకౌంట్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు అధికారం ఉంటుంది. ఆర్థిక శాఖ తీసుకువచ్చిన రూల్స్‌ను పాటించాల్సిందే. ఇరెగ్యులర్ అకౌంట్లకు సంబంధించి ఆర్థిక శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
ఇరెగ్యులర్ ఎన్ఎస్ఎస్ అకౌంట్స్, పిల్లల పేరుపై పీపీఎఫ్ అకౌంట్లు, ఒకటి కన్నా ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లు, ఎన్ఆర్ఐ పీపీఎఫ్ అకౌంట్ల పొడిగింపు, గ్రాండ్ పేమెంట్స్ ప్రారంభించిన సుకన్య సమృద్ధి అకౌంట్ల రెగ్యులైజేషన్ అనే ఆర కేటగిరిలను కొత్తగా తీసుకువచ్చారు.
ఒకటి కన్నా ఎక్కువ పీపీఎఫ్ అకౌంట్లు కలిగి ఉంటే.. అప్పుడు తొలిగా ప్రారంభించిన అకౌంట్‌ను కొనసాగిస్తారు. తర్వత తెరిచిన అకౌంట్‌ను తొలి అకౌంట్‌తో విలీనం చేసుకోవాలి. అంటే కలిపేసుకోవాలి. రెండు కన్నా ఎక్కువ అకౌంట్లు ఉంటే ఎలాంటి వడ్డీ రాదు. వాటిని క్లోజ్ చేసుకోవాలి. లేదంటే ఆ డబ్బులను తొలి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి.
యాక్టివ్ ఎన్ఆర్ఐ పీపీఎఫ్ అకౌంట్లు సెప్టెంబర్ చివరి వరకు కొనసాగుతాయి. వాటికి వడ్డీ లభిస్తుంది. అయితే తర్వాత మాత్రం ఎలాంటి వడ్డీ రాదు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య స్కీమ్ మినహాయించి పిల్లల పేరుపై తెరిచిన స్మాల్ సేవింగ్ స్కీమ్ అకౌంట్‌పై సాధారణ వడ్డీ వస్తుంది.
సుకన్య స్కీమ్ అకౌంట్‌ను గ్రాండ్ పేరెంట్స్ ఓపెన్ చేసి ఉంటే అలాంటప్పుడు గార్డియన్‌షిప్‌ను బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా లీగల్ గార్డియన్‌కు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఒకే కుటుంబంలో రెండు అకౌంట్ల కన్నా ఎక్కువ ఓపెన్ చేసి ఉంటే.. అలాంటి వాటిని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అలాగే పీపీఎఫ్ అకౌంట్‌ను పిల్లల పేరుపై తెరిస్తే.. ఆ అకౌంట్లకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత పీపీఎఫ్ వడ్డీ రేట్లు వస్తుంది. మైనర్, అడల్ట్‌గా మారిన దగ్గరి నుంచి అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ ప్రారంభం అవుతుంది.
ఎన్ఎస్ఎస్ అకౌంట్ల విషయానికి వస్తే.. తొలిగా ప్రారంభించిన అకౌంట్‌కు స్కీమ్ బెనిఫిట్స్ లభిస్తాయి. రెండో అకౌంట్‌కు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు, 200 బేసిస్ పాయింట్లు వర్తిస్తుంది.
అయితే రెండు అకౌంట్లలో ఇన్వెస్ట్ చేసిన మొత్తం ఏడాదిలో ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్‌ను దాటకూడదు. అలా దాటితే.. అదనపు డిపాజిట్లకు ఎలాంటి వడ్డీ రాదు. అక్టోబర్ నుంచి అయితే అదనపుప అకౌంట్లకు ఎలాంటి వడ్డీ ఉండదు.
0 Response to "Are you investing money in schemes like Sukanya Samriddhi and PPF? New rules from 1st"
Post a Comment