EPF Withdrawal Process
EPF Withdrawal Process : పీఎఫ్ ఎప్పుడు, ఎలా విత్ డ్రా చేసుకోవాలి? ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాలివే.
ఉద్యోగుల భవిష్య నిధి(EPF) లేదా ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల తమ భవిష్యత్ అవసరాలకు జీతంలో కొంత మొత్తా్న్ని పొదుపు చేసుకునే ప్రక్రియ.
దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. పదవీ విరమణ తర్వాత ఈ మొత్తాన్ని ఉద్యోగులకు అందిస్తారు. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగులు ప్రతి నెలా వారి వేతనంలో 12 శాతం పీఎఫ్ లో జమ చేయాలి. ఉద్యోగి వాటా, ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ వాటాను కలిపి... పీఎఫ్ ఖాతాకు బదిలీ చేస్తారు. ఈపీఎఫ్ ఖాతాల్లోని మొత్తానికి వార్షిక ప్రాతిపదికన వడ్డీ లెక్కిస్తారు.
ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. అయితే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ విత్ డ్రాకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న ఈపీఎఫ్ఓజారీ చేసిన సర్క్యులర్ ప్రకారం పీఎఫ్ పాక్షిక విత్ డ్రా పరిమితిని రూ.50,000 నుంచి రూ.లక్షకు (వైద్య చికిత్స) పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే ఎక్కువ వడ్డీ వస్తే పన్ను విధిస్తున్నారు. ఈ వడ్డీ కూడా సెక్షన్ 194A కింద టీడీఎస్ కి లోబడి ఉంటుంది.
ఈపీఎఫ్‌ని ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు?
ఉద్యోగులు తమ పీఎఫ్ ను ఎప్పుడైనా పూర్తిగా లేదా పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే పూర్తి నగదు విత్ డ్రా మాత్రం రెండు పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు.
ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు
వ్యక్తి ఒక నెల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉన్నప్పుడు, తన ఖాతాలోని మొత్తంలో 75% విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు నెలల కంటే ఎక్కువ కాలం నిరుద్యోగిగా ఉంటే మిగిలిన 25% విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాక్షికంగా విత్ డ్రా
కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. వైద్య చికిత్స, వివాహం, విద్య, భూమి కొనుగోలు లేదా ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం లేదా ఇల్లు పునర్నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, పదవీ విరమణకు ముందు పాక్షికంగా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్ ఎలా విత్‌డ్రా చేసుకోవాలి?
- ఫిజికల్ అప్లికేషన్
- ఆన్‌లైన్ అప్లికేషన్
- ఫిజికల్ అప్లికేషన్ విధానం
- ఈపీఫ్ బ్యాలెన్స్‌ని విత్ డ్రా చేసుకునేందుకు కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (ఆధార్)/కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (నాన్-ఆధార్) డౌన్‌లోడ్ చేసుకోండి.
కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (ఆధార్) :
మీరు యూఏఎన్ పోర్టల్‌లో మీ ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను లింక్ చేసి ఉంటే కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (ఆధార్) ఉపయోగించండి. మీ కంపెనీ ధృవీకరణ లేకుండానే సంబంధిత ఈపీఎఫ్ఓఆఫీసులోపూర్తి చేసిన ఫారమ్‌ను సమర్పించవచ్చు.
కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (నాన్-ఆధార్)
యూఏఎన్ పోర్టల్‌లో ఆధార్, బ్యాంక్ వివరాలు లింక్ చేయకపోతే కాంపోజిట్ క్లెయిమ్ ఫారమ్ (నాన్-ఆధార్) ఉపయోగించవచ్చు. అయితే మీరు పనిచేస్తున్న కంపెనీ ధృవీకరణతో ఈ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఈపీఎఫ్ఓ ఆఫీసులో సమర్పించాలి. పాక్షికంగా విత్ డ్రా చేసుకోవడానికి తగిన సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ లో పీఎఫ్ విత్ డ్రా విధానం
- ఆన్‌లైన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రాకు ఈపీఎఫ్ఓ సదుపాయం కల్పిస్తుంది.
- యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేట్ లో ఉండాలి.
- యూఏఎన్ ను యాక్టివేట్ చేయడానికి లింకైన మొబైల్ నంబర్ వర్కింగ్ లో ఉండాలి.
- యూఏఎన్ కేవైసీ అంటే ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా, IFSC కోడ్‌తో లింక్ చేసి ఉండాలి.
- ఈ వివరాలతో మీ ఖాతా లింక్ అయ్యి ఉండే మీరు పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
UAN పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో పీఎఫ్ విత్ డ్రా ఎలా?
- Step 1 : UAN పోర్టల్ https://passbook.epfindia.gov.in/ ను సందర్శించండి .
- Step 2 : మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
- Step 3 : 'Manage' ట్యాబ్‌పై క్లిక్ చేసి, మీ KYC వివరాలైన ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు లింక్ అయ్యాయో లేదో చెక్ చేయండి.
- Step 4: KYC వివరాలు చెక్ చేసిన తర్వాత 'Online services' ట్యాబ్‌లోకి వెళ్లి, డ్రాప్-డౌన్ మెనులో 'Claim(ఫారం-31,19,10C&10D)' సెలక్ట్ చేయండి.
- Step 5 : కింది ఉద్యోగి వివరాలు, కేవైసీ, ఇతర వివరాలు ఉంటాయి. మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి 'వెరిఫై'పై క్లిక్ చేయండి.
- Step 6: అండర్‌టేకింగ్ సర్టిఫికేట్‌పై సంతకం చేయడానికి Yes పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ చేయండి.
- Step 7: ఇప్పుడు 'Proceed for online claim'పై క్లిక్ చేయండి.
- Step 8: క్లెయిమ్ ఫారమ్‌లో, 'I Want To Apply For' అనే ట్యాబ్ పై క్లిక్ చేసి మీకు అవసరమైన క్లెయిమ్‌ను ఎంచుకోండి. అంటే ఈపీఎఫ్ సెటిల్‌మెంట్, ఈపీఎఫ్ పార్ట్ విత్ డ్రా(లోన్/అడ్వాన్స్) లేదా పెన్షన్ విత్ డ్రా ఆప్షన్ ఎంచుకోవాలి. ఉద్యోగి వీటికి అర్హత లేకపోతే ఈ ఆప్షన్లు చూపించవు.
- Step 9: మీ ఫండ్‌ను ఉపసంహరించుకోవడానికి 'పీఎఫ్ అడ్వాన్స్ (ఫారం 31)' సెలక్ట్ చేయండి. ఇందులో ముందస్తు ప్రయోజనం, అవసరమైన మొత్తం, ఉద్యోగి వివరాలు నమోదు చేయాలి.
- Step 10 : మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి. మీరు ఫారమ్‌ను నింపినప్పుడు ఏ ప్రయోజనం కోసం పీఎఫ్ ను విత్ డ్రా చేస్తున్నారో ఆ సర్టిఫికెట్ స్కాన్ కాపీలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ విత్ డ్రాపై పన్నులు
ఒక ఉద్యోగి వరుసగా ఐదేళ్లు పీఫ్ ఖాతాకు నగదు జమ చేస్తే ఈపీఎఫ్ విత్ డ్రా పన్ను రహితం. ఐదేళ్ల పీఎఫ్ జమలో విరామం వస్తే ఈపీఎఫ్ విత్ డ్రా మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఉద్యోగి ఐదేళ్లలోపు పీఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే లేదా 50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే టీడీఎస్ పరిధిలోకి వస్తుంది.
0 Response to "EPF Withdrawal Process "
Post a Comment