Bharat Bandh
Bharat Bandh: రేపు (21న) భారత్ బంద్ ఎందుకు ? : స్కూళ్లకు సెలవు ఉంటుందా.. బస్సులు, రైళ్లు తిరుగుతాయా..?
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుకు నిరసన రేపు ( ఆగస్టు 21 )న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి.
ఈ బంద్ కు రాజస్థాన్ లోని ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై రాష్ట్రాలదే అంతిమ నిర్ణయమని, అవసరమైన వారికి రిజర్వేషన్ కల్పించటంలో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ ఆగస్టు 1న తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. కాగా, సుప్రీంకోర్టు తీర్పును ఉపసంహరించుకోవాలని కోరుతూ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది రిజెర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి.బుధవారం జరిగే ఈ భారత్ బంద్‌కు వివిధ సామాజిక, రాజకీయ సంస్థల మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా బంద్ ను పరిశీలించేందుకు సీనియర్ సివిల్, పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారు. డివిజనల్ కమిషనర్లు, జిల్లా మెజిస్ట్రేట్లు, పోలీసు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరై బంద్‌కు సిద్ధం కావాలని కోరారు.
భారత్ బంద్ ఎందుకు అనేది తెలిసింది కదా.. ఇప్పుడు భారత్ బంద్ రోజు.. అంటే 2024, ఆగస్ట్ 21వ తేదీన బస్సులు, రైళ్లు తిరుగుతాయా.. స్కూల్స్ ఉంటాయా లేక సెలవు ప్రకటిస్తారా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు.. అదే విధంగా ఆర్టీసీ, రైల్వే శాఖల నుంచి భారత్ బంద్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. అంతే కాదు.. ఆయా శాఖల్లోని యూనియన్స్ సైతం భారత్ బంద్ పై ప్రకటన చేయలేదు.
ఇక స్కూల్స్ విషయంలోనూ విద్యా శాఖ లేదా ఆయా ప్రైవేట్ యాజమాన్యాలు అయితే సెలవు ప్రకటించలేదు. సో.. భారత్ బంద్ అయిన బుధవారం ఉదయం వరకు వెయిట్ చేయాల్సిందే.. అప్పటి వరకు నో క్లారిటీ.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బ్యాంకులు కూడా బంద్ ఉంటాయని.. బ్యాంక్ యూనియన్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. జస్ట్ భారత్ బంద్ అనేది మాత్రమే ఇప్పటి వరకు వచ్చిన వార్తలు.. ఏం ఉంటాయి.. ఏం మూసివేస్తారు.. వ్యాపార సంస్థలు నడుస్తాయా లేదా అనేది కూడా క్లారిటీ లేదు జనంలో.
0 Response to "Bharat Bandh"
Post a Comment