Only one became the god of the people of two states!
ఒకే ఒక్కడు రెండు రాష్ట్రాల ప్రజల పాలిట దేవుడయ్యాడు!
సరిగ్గా అప్పుడు వచ్చారు ఓ పెద్దాయన. వయసు 80 ఏళ్లు. వయసు శరీరానికే తప్ప... తనలోని ఆలచనలకు, తనలో నైపుణ్యాలకు, మరీ ముఖ్యంగా తన మనసుకు కాదన్నది ఆయన మాట. కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపించిన తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీర్... ప్రాజెక్టులకు ఉపద్రవాలు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఆయన. ఆయనే నాగినేని కన్నయ్యనాయుడు.
70 ఏళ్ల క్రితం కట్టిన ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు గేట్ల జీవిత కాలం సుమారు 45 ఏళ్లు. కానీ మరో 35 ఏళ్లు అదనంగా పని చేసింది. భారీ వర్షాలు , వరదలకు చాలా రోజుల తర్వాత తుంగభద్ర నిండటమే కాదు.. దిగువకు కూడా భారీగా నీళ్లు వదలాల్సి వచ్చింది. కాస్త వర్షాలు తగ్గడంతో గేట్లన్నీ మూసేసి… నీటిని నిల్వ చేసారు అధికారులు. నిండు కుండలా ఉన్న ప్రాజెక్టును చూసి.. ఈ ఏడాది రాయలసీమ, తెలంగాణ రైతులకు నీటి ఇబ్బందులు ఉండవనే అనుకున్నారంతా. తుంగభద్ర నది కర్నాటకలోని రాయచూరు నుంచి మంత్రాలయం మీదుగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు చేరుకుంటుంది. నిజానికి అక్కడ ఈ నది రెండు రాష్ట్రాలకు బోర్డర్ నదిలానే ఉంటుంది. కర్నూలు వచ్చిన తర్వాత కృష్ణలో కలుస్తుంది. అందుకే ఈ నదిపై ఉన్నప్రాజెక్టులు నిండాయంటే రాయలసీమ, తెలంగాణ రైతులకు కాస్త ఊరట. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేస్తూ ఒక్కసారిగా తుంగ భద్ర నది డ్యామ్‌లో 19వ నెంబర్ గేటు ఆగస్టు 10వ తేదీ రాత్రి కొట్టుకుపోయింది. అంతే.. ఒక్కసారిగా కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. దాంతో ఆ ఒక్క గేటుపై ఒత్తిడి పడి ప్రాజెక్టు మనుగడకే ప్రమాదం ఉండటంతో మరో దారి లేక మొత్తం గేట్లన్నీ ఎత్తేశారు. ఫలితంగా సుమారు 60 టీఎంసీల నీరు వృథాగా దిగువకు వచ్చేసింది. ఇక ఆ డ్యామ్ ఖాళీ అయిపోతే సరిహద్దు తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంతే.
ఎప్పుడో కానీ పూర్తిగా నిండదు!
సాధారణంగా హోస్పేట్ దగ్గర ఉన్న తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో కానీ నిండదు. ఎందుకంటే అప్పటికే వీలైనంత నీటిని నిల్వచేసే విధంగా కర్నాటక ఎగువన అనేక ప్రాజెక్టులు నిర్మించింది. అవన్నీ పూర్తిగా నిండిన తర్వాతే మనకు ఆ నీళ్లు దిగువకు వస్తాయి. ఈ పరిస్థితుల్లో తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో ఈ సీజన్‌కు ఢోకా లేదనే అంత భావించారు. మొత్తం 60 టీఎంసీల నీటిని కిందకు వదిలేయడం తప్ప మరో మార్గం లేదని తేల్చేసింది కర్నాటక ప్రభుత్వం.
ఆపద్బాంధవుడు
సరిగ్గా అప్పుడు వచ్చారు ఓ పెద్దాయన. వయసు 80 ఏళ్లు. వయసు శరీరానికే తప్ప… తనలోని ఆలచనలకు, తనలో నైపుణ్యాలకు, మరీ ముఖ్యంగా తన మనసుకు కాదన్నది ఆయన మాట. కేవలం మాటల్లోనే కాదు.. చేతల్లో కూడా చూపించిన తెలుగు జాతి గర్వించదగ్గ ఇంజనీర్… ప్రాజెక్టులకు ఉపద్రవాలు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే వ్యక్తి ఆయన. ఆయనే నాగినేని కన్నయ్యనాయుడు. తన వృత్తి ఉద్యోగ జీవితానికి స్వస్తి పలికి తనకు నచ్చిన తుంగభద్ర తీరంలోనే సేద తీరుతున్న ఆయన్ను వెంటనే కర్నాటక, ఆంధ్ర ప్రభుత్వాలు సంప్రదించాయి. అంతే రెక్కలు కట్టుకొని ప్రాజెక్టు దగ్గర వాలిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. వారం రోజుల పాటు ఆయన స్వయంగా సమస్యను అధ్యయనం చేశారు. ప్రాజెక్టుకు ఉన్న 35 క్రస్టు గేట్లలో 11 మినహా మిగిలిన అన్నింటినీ పరిశీలించారు. జలాశయం జీవిత కాలం వందేళ్లయితే ఈ గేట్ల జీవిత కాలం 45 ఏళ్లే. కానీ ఇప్పటికే 70 ఏళ్లు గడిచిపోయాయి. అస్సలు తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా 70 ఏళ్ల పాటు ఉన్న ప్రాజెక్టు గేట్లేవీ లేవంటారు కన్నయ్యనాయుడు. ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో కడుతున్న ప్రాజెక్టుల్లో క్రస్ట్ గేట్లు అమర్చిన 20 ఏళ్లకే పాడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో స్టాప్ లాగ్ గేట్ల ద్వారా వృథాగాపోతున్న నీటికి అడ్డుకట్ట వెయ్యాలని డిసైడ్ అయ్యారు.
50 ఏళ్ల అనుభవం
జలాశయాలకు గేట్లను అమర్చడంలో కన్నయ్యనాయుడుకి 50 ఏళ్లకు పైబడి అనుభం ఉంది. ఆయన గతంలో భారీ జలాశయాలకు క్రస్ట్ గేట్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాలను అమర్చడం, భారీ క్రేన్ల డిజైనింగ్ ఇలా వివిధ విభాగాలలో విశేషమైన అనుభవం, నైపుణ్యాలున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఆయన సుమారు 250కి పైగా వివిధ ప్రాజెక్టుల గేట్ల నిర్మాణంలో పాల్గొన్నారు. కర్నాటకలోని నారాయణ్ పూర్, అలమట్టి, సుపా, భద్రా, హిమవతి డ్యాంలకే కాదు తుంగ బ్యారేజీని నిర్మించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక మన విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లోని శ్రీశైలం, నాగారన్జున సాగర్, సోమశిళ, జురాల, వంటి డ్యాంల గేట్లను తయారు చెయ్యడంలోనూ, వాటికి రిపైర్లు చెయ్డయడంలోనూ ఆయనది కీలక పాత్రే. అంతేందుకు విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజీలో నీటి మట్టాన్ని ఏ మాత్రం తగ్గించకుండానే ఆ గేట్లకు మరమ్మత్తులు చేయించారు .2007లో నారాయణపుర జలాశయంలో గేట్ దెబ్బతింటే దానికి వెంటనే ప్రత్యమ్నాయాలను ఏర్పాటు చేశారు. కేవలం తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో ప్రాజెక్టులు మాత్రమే కాదు, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఒడిషా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లోనూ ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల క్రస్ట్ గేట్లు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అనేక నీటి పారుదల ప్రాజెక్టుల్లో సమస్యలు తలెత్తినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చే పేరు ఆయనదే.
తుంగను భద్రంగా ఉంచారు
ఆయన విశేష అనుభవం తాజాగా తుంగను భద్రంగా ఉంచింది. ఖాళీ అవుతుందని బెంగపడ్డ రైతుల దిగులు తీర్చింది. మొత్తం 5 స్టాప్ లాగ్ గేట్లను విడతల వారీగా అమర్చి.. నీరు వృథా కాకుండా అడ్డుకున్నారు. ఆయనే స్వయంగా చి.. నీరు వృథా కాకుండా అడ్డుకుంపనులను పర్యవేక్షిస్తూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేయాల్సి వచ్చినా… ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగుండా అన్నీ జాగ్రత్తలు తీసుకొంటూ విజయవంతంగా గేట్ అమర్చారు. కన్నయ్య నాయకత్వ ప్రతిభకు, ఆయన నైపుణ్యానికి, అటు కర్నాటక సీఎం, ఇటు ఏపీ సీ ఎం ఇద్దరూ కృతజ్ఞలు తెలిపారు.
కన్నయ్య నేపథ్యమేంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా రాసానపల్లె ఆయన స్వగ్రామం. స్వతంత్ర్యం రావడానికి ఒక్క ఏడాది ముందు అంటే 1946లో పుట్టారు. పుట్టింది ఓ సాధారణ రైతు కుటుంబంలో. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆపై తమిళనాడులోని సదరన్ స్ట్రక్చర్ కంపెనీలో ఐదేళ్లు ఇంజనీరుగా సేవలందించారు. ఆ తర్వాత కర్నాటకలోని హోస్పేట్ సమీపంలో తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్ లిమిటెడ్‌లో డిజైన్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పని చేశారు. ఆపై మేనేజర్‌గా ప్రమోషన్ పొందారు. సుమారు రెండున్నర దశాబ్దాలకు పైగా అదే సంస్థలో పని చేశారు. అలా భారీ జలాశయాలకు క్రస్ట గేట్ల నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో యంత్రాల అమరిక, భారీ క్రేన్ల డిజైనింగ్ ఇలా అనేక విభాగాల్లో ఆయన ప్రతిభ చూపిస్తూ వచ్చారు. అదే అనుభవం ఇప్పుడు తుంగభద్ర విషయంలోనూ పనికొచ్చింది.
పెనుప్రమాదం వేళ.. నేనున్నానంటు
1953లో నిర్మించిన తుంగభద్ర డ్యాంకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్టు 10న అర్ధరాత్రి వేళ నీటి ఒత్తిడికి ఓ గేటు కొట్టుకుపోగా.. మరునాడే కన్నయ్యనాయుడు మరమ్మతులకు ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఆపార అనుభవం గడించిన ఆయన తుంగభద్రమ్మ రుణం తీర్చుకుంటానని సంకల్పించారు. కొట్టుకుపోయిన గేటు 60 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉండగా, దాని స్థానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటు చేయించారు. వారం రోజుల ప్రయాస తర్వాత 17న ఆ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేసి, అన్నదాతల ఆశలు నిలిపారు.
0 Response to "Only one became the god of the people of two states!"
Post a Comment