GATE 2025 Registration
GATE 2025 Registration :రేపటి నుంచి గేట్ 2025 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.దరఖాస్తు చేసుకొనే విధానం
GATE 2025 Registration : దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025).. రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియ ఆగస్ట్ 28వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్ష రాయాలనుకునే అర్హులైన అభ్యర్థులు గేట్ 2025 అధికారిక వెబ్‌సైట్ https://gate2025.iitr.ac.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 26 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
గేట్ 2025 దరఖాస్తు ఫీజు మహిళా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.900. ఆలస్య రుసుముతో చెల్లిస్తున్నట్లయితే, దరఖాస్తు ఫీజు రూ .1,400 చెల్లించాలి. మిగతా అభ్యర్థులందరికీ రెగ్యులర్ ఇన్‌టైమ్‌లో అయితే రూ.1,800గా ఉంటుంది. ఆలస్య రుసుముతో చెల్లించినట్లయితే.. దరఖాస్తు ఫీజు రూ.2,300 చెల్లించాల్సి ఉంటుంది.
వాస్తవానికి గేట్ 2025 దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో యూజీసీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీని వాయిదా వేసింది. అయితే.. రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ వాయిదా వేయడం వల్ల పరీక్ష షెడ్యూల్ సహా ఇతర తేదీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. గేట్ 2025 పరీక్షను ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. ఒక అభ్యర్థి గేట్ 2025 పరీక్షలో రెండు పేపర్ల వరకు రాయడానికి వీలుంటుంది.
ఈసారి గేట్ 2025 నిర్వహణ బాధ్యతను రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Roorkee) చేపట్టింది. మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ 2025 పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో గేట్-2025 పరీక్ష నిర్వహించనున్నారు. గేట్‌లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయనే విషయం తెలిసిందే.
అలాగే.. గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీలు (బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తోపాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
గేట్ 2025 పరీక్ష విధానం :
మొత్తం 30 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు.. టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున.. 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
0 Response to "GATE 2025 Registration"
Post a Comment