Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sri Krishna Janmashtami

ఈరోజు శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా గోకులష్టమి 

శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత ఏంటి ? పూజా విధానం ఏంటి ?

కృష్ణం వందే జగద్గురుమ్.సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని "కృష్ణాష్టమి", "గోకులాష్టమి" లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు.

*స్మార్తులు* తిధితో పండగ జరుపుకుంటే , వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు. శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు.

మహిమాన్వితమైన కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు ) నిద్ర లేచి , తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపుకుంకుమ , గుమ్మానికి తోరణాలు , పూజా మందిరములో ముగ్గులు వేయాలి.

ఉపవాస దీక్షలు 

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి , సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు , శొంఠి , బెల్లం కలిపిన వెన్న , పెరుగు , మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు , కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ' లేదా ‘ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.

పసుపు , కుంకుమ , గంధము , పుష్పాలతో 

పూజకు ఉపయోగించే పటములకు పసుపు , కుంకుమ గంధము , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ , ప్రతిమను ఉంచాలి. ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు , కదంబ పుష్పములు , తులసిమాల , సన్నజాజులతో మాల , నైవేద్యానికి పానకం , వడపప్పు , కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.

దీపారాధాన 

తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి , ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి , తూర్పు దిక్కున తిరిగి , 'ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం , కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి , పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

దీక్షతో దక్షత

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి , శ్రీకృష్ణునికి పూజ చేసి , శ్రీకృష్ణ దేవాలయాలు , మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ , కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి , అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని , ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.

సంతానం లేని వారు , వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ , నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు !

ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః !

ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః !

ఈ మంత్రముతో ఈరోజు ఎవరైతే 108 సార్లు ధ్యానం చేస్తుంటారో వారి , దుఃఖం హరించిపోతుంది.

గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే.. సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.

హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా , చిన్నవారికి చిలిపి కృష్ణునిగా , స్త్రీలకు గోపికా వల్లభునిగా , పెద్దలకు గీతాకారునిగా... ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు.అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం.

కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని సూచిస్తారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే ! కృష్ణాష్టకమ్‌ , కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ , పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం , భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ , కొలుస్తూ , భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి , కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు. అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి.... దాని మీద ఒక కుండని పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి , కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sri Krishna Janmashtami "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0