Canara Bank Apprentice Recruitment 2024
Canara Bank : కెనరా బ్యాంక్లో 3000 ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల.Degree, బీటెక్ గ్రాడ్యూయేట్లు అప్లయ్ చేసుకోవచ్చు
Canara Bank Apprentice Recruitment 2024 : బెంగళూరులోని కెనరా బ్యాంక్ (Canara Bank).. హ్యూమన్ రిసోర్సెస్ విభాగం, ప్రధాన కార్యాలయం భారీ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3000 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 4 దరఖాస్తులకు చివరితేది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు సెప్టెంబర్ 21న వెల్లడికానున్నాయి.
ముఖ్యమైన సమాచారం :
మొత్తం ఖాళీలు: 3,000
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01.09.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదీ: 21.09.2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 04.10.2024
WEBSITE : https://canarabank.com/pages/Recruitment
0 Response to "Canara Bank Apprentice Recruitment 2024 "
Post a Comment