Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know what happens if you eat soaked almonds for 7 days in a row?

 నానబెట్టిన బాదం పప్పులను వరుసగా 7 రోజుల పాటు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

బాదం పప్పులను అలాగే కాకుండా.. రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే నానబెట్టిన బాదం పప్పులను మీరు వరుసగా 7 రోజుల పాటు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

బాదం పప్పుల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన జ్ఞాపకశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయని ఇంట్లో పెద్దలు కూడా చెప్తుంటారు. ఇదొక్కటే కాదు.. బాదం పప్పులను ప్రతిరోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుపడటం నుంచి రోగనిరోధక శక్తి పెరగం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

బాదం పప్పుల్లో విటమిన్ ఇ, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ మొత్తమే ఉండదు. కాబట్టి ఇది మీ జీర్ణక్రియకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

అయితే వీటిని అలాగే కాకుండా రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరిగడుపున వాటి తొక్కలను తీసేసి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీరు వరుసగా 7 రోజుల పాటు బాదం పప్పులను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. వ్యాధులు రాకుండా ఉంటటానికి రోగనిరోధక శక్తి కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే బాదం పప్పులను తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దీనిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఒంట్లో రక్తం తక్కువగా ఉన్నవారు బాదం పప్పులను రోజూ తినాలి. ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కుమ మొత్తంలో ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తింటే రెండు వారాల్లో మీ శరీరంలో తేడాను గమనిస్తారు.

మెరుగైన జీర్ణక్రియ

బాదం పప్పుల్లో మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఐరన్,విటమిన్ కె, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్, రాగి, జింక్ మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బాదం పప్పులను నీళ్లలో నానబెడితే ఆల్గేలో ఎంజైమ్ విడుదలవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది

బాదం పప్పులను రోజూ తింటే మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఇది మీ పిల్లల మెదుడు సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకు రోజూ నానబెట్టిన బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు మెదడు కణాలను రిపేర్ చేస్తాయి. అలాగే ఐక్యూ లెవెల్స్ ను పెంచుతాయి. మెదడును షార్ప్ గా చేస్తుంది.

గుండె ఆరోగ్యానికి బాదం

బాదం పప్పులు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పప్పులు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడతాయి. బాదం పప్పుల్లో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

గర్భధారణ సమయంలో

బాదం పప్పుల్లో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి సహాయపడుతుంది. ఎండిన బాద పప్పు కంటే నానబెట్టిన బాదం పప్పులే చాలా సులువుగా జీర్ణమవుతాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు నానబెట్టిన బాదం పప్పులను తింటే ఆరోగ్యంగా ఉంటారు.

శరీర అలసటను తగ్గిస్తుంది

బాదం పప్పులు మంచి శక్తి వనరులు. ఈ పప్పుల్లో విటమిన్లు, మినరల్స్, ఇతర న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీర బలహీనతను పోగొడతాయి. శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తాయి. అంతకాదు నానబెట్టిన బాదం పప్పులను తింటే జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇవి జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know what happens if you eat soaked almonds for 7 days in a row?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0