Dussehra holiday announcement details for AP schools
ఏపీ స్కూళ్లకు దసరా సెలవుల ప్రకటన వివరాలు.
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సందర్బంగా సెలవుల్ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యాసంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
దీంతో విద్యార్ధులకు ఈ ఏడాది దసరా సెలవుల తేదీలను అధికారులు ప్రకటించారు. వీటినే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్ని ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే నెల 3 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే నెల 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్ధులకు దసరా సెలవులు లభించనున్నాయి.
రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ ను ప్రకటించింది. దీని ప్రకారం దసరాతో పాటు సంక్రాంతి, ఇతర సెలవులను ముందుగానే నిర్ధారించారు. వీటి ప్రకారమే ఇప్పుడు సెలవులను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెలవులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉల్లంఘిస్తే విద్యాశాఖ తగు చర్యలు తీసుకోనుంది.
0 Response to "Dussehra holiday announcement details for AP schools"
Post a Comment