NPS Vatsalya
NPS Vatsalya: పిల్లల బంగారు భవిష్యత్తుకు కేంద్రం నుంచి అదిరిపోయే స్కీం.. 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే 11.05 కోట్ల దాకా లాభం!
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. వారికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇందులో భాగంగా ఎన్నో రకాల పొదుపు పథకాలలో డబ్బులను పొదుపు చేస్తారు. వారి కోసం ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. పిల్లల కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం పేరు ఎన్ పీఎస్ వాత్సల్య. ఈ పథకంలో పిల్లల పేరు మీద కనుక మీరు కొంత డబ్బును కడితే వారికి 18 ఏళ్ల నిండిన తర్వాత ఇది సాధారణ పెన్షన్ ఖాతాగా మారుతుంది. ఇక కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ఎన్ పీఎస్ వాత్సల్య పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల తల్లిదండ్రులు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీములో తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు పెట్టుబడి పెడితే ఎన్నో లాభాలు పొందవచ్చు. ఈ పథకానికి సాధారణ ఎన్ పీఎస్ ఖాతాల లాగానే పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణ ఉంటుంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ ఆఫీసులు, ఇ-ఎన్ పీఎస్ పోర్టల్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి తల్లిదండ్రుల కేవైసీ అవసరం. అలాగే పిల్లలకు సంబంధించిన గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వాలి. ఈ పథకంలో తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద సంవత్సరానికి కనీసం రూ.వెయ్యి ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇందులో గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. పిల్లలకు 18 ఏళ్ళు నిండిన తరువాత అది సాధారణ ఎన్ పీఎస్ ఖాతాగా మారుతుంది.
ఇందులో ఒక ప్లాన్ ప్రకారం పొదుపు చేశారంటే పిల్లలకు వారు పెద్ద అయ్యాక బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఈ పథకంలో 18 సంవత్సరాల దాకా 10 వేలు పెట్టుబడి పెట్టారంటే వారికి 10 శాతం వడ్డీ కింద 5 లక్షలు జమ అవుతుంది. ఆ డబ్బుని 18 సంవత్సరాలకి డ్రా చెయ్యకుండా 60 సంవత్సరాల పాటు కొనసాగిస్తే వారి రిటైర్మెంట్ సమయానికి అంటే 60 ఏళ్లకు 10% వడ్డీతో రూ. 2.75 కోట్లు, 11.59% వడ్డీతో రూ. 5.97 కోట్లు,12.86% వడ్డీతో రూ. 11.05 కోట్లు డబ్బు జమ అవుతుంది. ఈ పథకంలో వడ్డీ అనేది మనం పెట్టుబడి పెట్టే డబ్బుని బట్టి మారుతుంది. ఇక పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
0 Response to "NPS Vatsalya"
Post a Comment