GAIL India JOBs 2024
టెన్త్, ఇంటర్, ఐటిఐ తో గెయిల్ ఇండియా 391ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ GAIL India JOBs 2024, Apply Online here.
భారత ప్రభుత్వ మహారత్నా సంస్థ అయినా గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 391 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 08.08.2024 నుండి 07.09.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
మొత్తం పోస్టుల సంఖ్య : 391.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
జూనియర్ ఇంజనీర్ (కెమికల్) - 02,
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) - 01,
ఫోర్ మెన్ (ఎలక్ట్రికల్) - 01,
ఫోర్ మెన్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 14,
ఫర్ మెన్ (సివిల్) - 06,
జూనియర్ సుపరిటెండెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 05,
జూనియర్ కెమిస్ట్ - 08,
జూనియర్ అకౌంటెంట్ - 14,
టెక్నికల్ అసిస్టెంట్ (లాబరేటరీ) - 03,
ఆపరేటర్ (కెమికల్) - 73,
టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) - 44,
టెక్నీషియన్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 45,
టెక్నీషియన్ (మెకానికల్) - 39,
టెక్నీషియన్ (టెలికాం & టెలీమెట్రి)- 11,
ఆపరేటర్ (ఫైర్) - 39,
ఆపరేటర్ (బాయిలర్) - 08,
అకౌంట్స్ అసిస్టెంట్ - 13,
బిజినెస్ అసిస్టెంట్ - 65.. మొదలగునవి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా, సి.ఏ, ఐసిడబ్ల్యుఏ, బి.ఎస్సి, బి.కాం, బి.బి.ఏ, బి.బి.ఎస్, బి.బి.ఎం, బి.ఈ, బి.టెక్ ఏం.మ్మెస్సీ ,ఎం.కామ్, పిహెచ్డి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 07.09.2024, నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకూడదు.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 15 సంవత్సరాల వరకు వయో-పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫెసర్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఫిజికల్ అండ్ ఎన్డీవ్ రెన్స్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
పోస్టులను బట్టి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి, నెలకు రూ.29,000/- నుండి రూ.1,38,000/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
జనరల్ , ఈ డబ్ల్యూఎస్, మరియు ఓబిసి నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.50/-
ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 08.08.2024 ఉదయం 11:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 07.09.2024 సాయంత్రం 05:59 వరకు.
WEBSITE : https://www.gailonline.com/
CLICK HERE FOR APPLY FOR THE JOB
0 Response to "GAIL India JOBs 2024"
Post a Comment