IOB Recruitment 2024
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ భారీగా ఖాళీల భర్తీ IOB Opening 550 Vacancies Apply Online here..
IOB Recruitment 2024 : చెన్నైలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) సెంట్రల్ ఆఫీస్.. భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 550 (యూఆర్- 284, ఎస్సీ- 78, ఎస్టీ- 26, ఓబీసీ- 118, ఈడబ్ల్యూఎస్- 44) అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 22.. తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐఓబీ శాఖల్లో ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.iob.in/Careers వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 550
ఆంధ్రప్రదేశ్‌లో 22; తెలంగాణలో 29 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది.
స్టైపెండ్: నెలకు మెట్రో ప్రాంతానికి రూ.15,000.. అర్బన్ ప్రాంతానికి రూ.12,000.. సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతానికి రూ.10,000 స్టైపెండ్ ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్ సబ్జెక్టులు: జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు), కంప్యూటర్/ సబ్జెక్ట్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు- 25 మార్కులు) ఉంటాయి. అలాగే.. పరీక్ష మొత్తం వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు రూ.600. దివ్యాంగులకు రూ.400 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 28, 2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 10, 2024.
దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: ఆగస్టు 28, 2024 నుంచి సెప్టెంబర్ 15, 2024 వరకు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 22, 2024.
https://www.iob.in/Careers
0 Response to "IOB Recruitment 2024"
Post a Comment