Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health Benefits Of Dates

 Dates: ఖర్జూరం తింటున్నారా? అయితే షుగర్ లెవల్స్ తగ్గడం ఖాయం!

Health Benefits Of Dates

Health Benefits Of Dates: డ్రై ఫూట్స్‌ ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో శరీరానికి కావాల్సి న పోషకాలు బోలెడు ఉంటాయి. వీటిని చాలా మంది స్వీట్స్‌లో, ఫ్రూట్‌ సలాడ్‌, షాక్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

డ్రై ఫూట్స్‌లో ముఖ్యంగా ఖర్జూరం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇందులో అనేక రకాలు ఉంటాయి. చాలా మంది ఖర్జూరం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని భావిస్తారు. కానీ ఇది బరువు తగ్గించడంలోనే కాకుండా వివిధ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఖర్జూరం వల్ల కలిగే లాభాలు. పోషక విలువలు, ఎలాంటి సమస్యలను తొలగిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. 

ఖర్జూరంలో చాలా పురాతనమైన డ్రై ఫూట్స్‌. ఇది ఎడారిలో ఎక్కువగా పెరుగుతుంది. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఖర్జూరం లో పోటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివి. ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తినడం వల్ల ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుచుతుంది. అలాగే మలబద్దకంను నివారిస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ఖర్జూరం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఖర్జూరంలో సహజంగా చక్కెర ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. బరువు సమస్యతో బాధపడేవారు ఖర్జూరం నీటిని తీసుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గుతారు. ఖర్జూరాలలోని ఐరన్ రక్తహీనత శక్తిని నివారించడంలో సహాయపడుతుంది.

ఖర్జూరం వల్ల ఎలాంటి సమస్యలు తగ్గుతాయి:

ఖర్జూరాలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఖర్జూరాలు తినడం వల్ల కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్‌ వంటి జీర్ణసమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలా మంది అలసట, నీరసం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వీరు ప్రతిరోజు ఖర్జూరం నీరు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా ఉంటుంది. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా ఖర్జూరం తీసుకోవడం చాలా మంది రెండు ఎండు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తొలుగుతుంది. 

కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఎండు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం శరీరానికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఖర్జూరం తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. రక్తహీనత శక్తితో బాధపడేవారు నల్ల ఖర్జూరాలను తీసుకోవడం వల్ల రక్త సమస్యలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తక్కువ మొత్తంలో తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు ఖర్జూరాలు తినే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health Benefits Of Dates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0