Lifestyle: Do you know how long people of any age should walk?
Lifestyle: ఏ వయస్సు వారు ఎంతసేపు నడవాలో తెలుసా.?
ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. వ్యాయామాలు చేసే వారు కూడా చాలా తగ్గిపోయారు. గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, స్మార్ట్ ఫోన్స్‌తో కుస్తీలు పడడంతో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.
అందుకే వాకింగ్‌ను కచ్చితంగా అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
అందుకే ప్రతీ రోజూ కచ్చితంగా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, దాదాపు అందరూ రోజుకు కనీసం 3 కిలోమీటర్లు నడవాలి. వామ్మో అన్ని కిలోమీటర్లు నడవడం అసాధ్యమని అంటారా.? అయితే ఉదయం లేచింది మొదలు రాత్రి మనం పడుకునే వరకు నడిచిన మొత్తం అడుగులు దీనికి సమానం అని నిపుణులు చెబుతున్నారు.
అయితే రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా యువత రోజూ కనీసం 150 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. అయితే ఒక వ్యక్తి ఎంత దూరం నడవాలనేది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 8,000 నుంచి 10,000 అడుగులు వేయాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే 60 ఏళ్లకు పైబడిన వారు రోజుకు 6,000 నుంచి 8,000 అడుగులు నడవాలని సూచిస్తున్నారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని పరిశోధకులు ఈ విషయాలను తెలిపారు. రోజూ ఉదయం లేదా సాయంత్రం కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు వేగంగా నడిస్తే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక చిన్నారుల విషయానికొస్తే 6 నుంచి 17 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు రోజుకు కనీసం 60 నిమిషాలు అయినా ఆడుకోవడం, పరిగెత్తడం వంటివి చేయాలి.
0 Response to "Lifestyle: Do you know how long people of any age should walk?"
Post a Comment