Vomiting During Travel
Motion sickness: ప్రయాణంలో వాంతులు వస్తున్నాయా? అయితే ఇవి గుర్తుంచుకోగలరు.
Vomiting During Travel: ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్లడానికి తప్పకుండా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయడం తప్పనిసరి అయినప్పటికీ వెళ్లే మార్గాలు వేరుంటాయి.
కొంతమంది బస్సు ద్వారా ప్రయాణాలు చేస్తే మరికొంత మంది రైలు లేదా విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో చాలా మంది తల తిరగడం వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. మరికొందరైతే వాంతులు కూడా చేసుకుంటారు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఎండాకాలంలో వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాణంలో ఈ వస్తువులు తప్పకుండా బ్యాగ్‌లో ఉంచుకోవాల్సి ఉంటుంది:
పుదీనా:
ప్రయాణ సమయంలో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుదీనా తీసుకోవాల్సి ఉంటుంది. వాంతులు వచ్చే క్రమంలో వీటిని నమిలి తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని పచ్చిగా తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
నిమ్మకాయ:
నిమ్మకాయలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ఈ రసం ప్రతి రోజూ తాగడం వల్ల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ప్రయాణంలో వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు ఉంటే నిమ్మ రసం నీళ్లలో కలిపి తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
అల్లం:
వాంతులు, వికారం సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.కాబట్టి ప్రయాణ క్రమంలో అల్లాన్ని నీటిలో మరిగించి తాగడం వల్ల కూడా సులభంగా ఉపమశనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది.
అరటి పండ్లు:
ప్రయాణ క్రమంలో వాంతుల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణం చేసే ముందు ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకోవడం వల్ల తల తిరగడం వంటి సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
0 Response to "Vomiting During Travel"
Post a Comment