Why are things cheap in Demart? Let's know the reason
డీమార్ట్ లో వస్తువులు చౌకగా ఎందుకు లభిస్తాయి..? కారణం తెలుసు కుందాం
మనం నం ఇంట్లో వాడే పప్పులు ఉప్పుల నుంచి దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాల వరకు చాలామంది డీమార్ట్ లో కొంటూ ఉంటారు. డీమార్ట్ లో వస్తువులు చాలా చౌకగా లభిస్తాయి.
దాని వెనక కారణమేంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా..? అసలు డిమార్ట్ లో అంత తక్కువ ధరకు సామాన్లు ఎందుకు లభిస్తాయి దాని వెనుక రహస్యం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెట్రో నగరాల నుంచి కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరాల వరకు ప్రతి చోటా డీమార్ట్ ఉంటుంది. డీమార్ట్ ఖ్యాతి అంతలా పెరిగింది అంటే మధ్యతరగతి ప్రజలు దీనిని ఎక్కువగా సందర్శిస్తున్నారు.
దుస్తులు, కిచెన్ ఐటమ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్న వాళ్లు కూడా ఆన్లైన్ షాపింగ్ కి గట్టి పోటీని కూడా ఇస్తోంది. అయితే డిమార్ట్ లో వస్తువులు ఎందుకు అంత తక్కువ ధరకే లభిస్తాయి దాని వెనక కారణమేమిటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఇలా చౌకగా వస్తువులు లభించడం వెనక ఒక మాస్టర్ మైండ్ ఆలోచన ఉంది. 12వ తరగతి వరకు మాత్రమే ఆయన చదువుకున్నారు. కానీ ఇప్పుడు తన వ్యాపార ప్రతిభతో దేశంలోనే సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన పేరు రాధాకిషన్ ధమాని. ఆయనే డీమార్ట్ వ్యవస్థాపకుడు. ఈయన ఆస్తులు లక్ష కోట్లకు పైగా ఉన్నాయి.
ఈయన కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారట. స్టాక్ మార్కెట్లో ముందంజలో ఉన్న ధమాని సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. మొదట్లో అనేక వైఫల్యాలను ఎదుర్కొన్నారు. 2002లో ముంబై లో డీమార్ట్ తొలి స్టోర్ ని ప్రారంభించారు. అద్దె స్థలంలో డీమార్ట్ స్టోర్ ఏర్పాటు చేయకూడదని అనుకున్నారు ప్రస్తుతం దేశంలో 300 కి పైగా స్టోర్లు ఉన్నాయి. డీమార్ట్ లో వస్తువులు తక్కువ ధరలు లభించడానికి నిజమైన కారణం ఏంటంటే అద్దె దుకాణం తెరవకపోవడం. దీనివలన అతని వ్యాపారానికి నిర్వహణ ఖర్చులు చాలా తగ్గాయి. డీమార్ట్ త్వరగా తన స్టాక్ ని కూడా పూర్తి చేసుకుంటుంది. 30 రోజుల్లో సరుకులు పూర్తి చేసి కొత్త వస్తువులని ఆర్డర్ చేయాలన్నది లక్ష్యం.
0 Response to "Why are things cheap in Demart? Let's know the reason"
Post a Comment