Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are old Rs.100 notes valid? Explanation of RBI.

 పాత రూ.100 నోట్లు చెల్లవా? RBI వివరణ.

Are old Rs.100 notes valid? Explanation of RBI.

పాత రూ.100 నోట్లు చెల్లవని సోషల్ మీడియాలో హాల్ చల్ అవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొందరు దుకాణదారులు పాత రూ.100 నోట్లు తీసుకోకపోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీని మరిన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాం లలో వైరల్ అవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై RBI స్పందించింది. పాత రూ.100 నోటు గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందో ఇక్కడ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

కరెన్సీ నోట్లు రద్దు చేయాలన్నా, కొత్తవి ప్రింట్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కి మాత్రమే అధికారం ఉంటుంది. ఆర్‌బిఐను 1935లో స్థాపించారు. అప్పట్లో దీని ప్రధాన కేంద్రం కోల్ కతాలో ఉండేది. తర్వాత ముంబైకి మార్చారు. ప్రారంభంలో ఇది ప్రైవేటు వ్యక్తుల పర్యవేక్షణలో ఉండేది. అయితే 1949లో జాతీయం చేశారు. అప్పటి నుంచి భారత ప్రభుత్వం అధీనంలోకి వచ్చింది. రిజర్వ్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత గవర్నరుగా శక్తికాంత దాస్ పనిచేస్తున్నారు. రూ.100 నోట్ల విషయంలో ఆయన చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన తరువాత 1949లో మొదటిసారి మహాత్మా గాంధీ ఫోటోతో 100 రూపాయల నోటు ముద్రించారు. అప్పటి నుంచి ఇది వివిధ డిజైన్లు, సైజులు, రంగులతో ప్రింట్ అయ్యి సమాజంలో చలామణి అవుతోంది. నకిలీ నోట్ల వాడుకలోకి పెరిగిపోయినప్పుడు, వివిధ డవలప్ మెంట్ కారణాలతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్ల రూపు రేఖలు మార్చి ఎప్పటికప్పుడు కొత్త రూపంలో చలామణిలోకి తీసుకు వచ్చేది.

1970లలో బ్లూ, గ్రీన్ కలర్ టోన్‌తో నోటు డిజైన్ జరిగింది. ఇది ఆ కాలంలో ప్రజాదరణ పొందింది. 1980లలో దీనిలో మార్పులు చేశారు. దాని సైజు, డిజైన్‌ మార్చారు. అప్పటి వరకు మహాత్మా గాంధీ చిత్రం కరెన్సీ నోట్లపై ముద్రించలేదు. 1996లో మహాత్మా గాంధీ సిరీస్ ప్రారంభమైంది. దీనిలో మహాత్మా గాంధీ చిత్రంతో కొత్త 100 రూపాయల నోటు ముద్రించారు. 2005లో కౌంటర్‌ ఫీట్‌ని తగ్గించే నూతన సాంకేతికతతో మరిన్ని ఫీచర్లతో నోటును సవరించారు. దీంతో నకిలీ నోట్ల ఇబ్బంది తగ్గింది. 2018లో కొత్త మహాత్మా గాంధీ సిరీస్‌లో 100 రూపాయల నోటును ప్రవేశపెట్టారు. ఇందులో వైలెట్ కలర్‌తో వాటర్‌మార్క్ తో పాటు ఆగ్రాలోని 'రాణీ కి వావ్' చిత్రంతో కొత్త డిజైన్ దేశవ్యాప్తంగా చలామణిలోకి వచ్చింది.

1980, 90 సమయంలో నకిలీ నోట్ల చలామణి ఎక్కువగా ఉండటంతో వాటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. వాటర్ మార్క్, త్రివర్ణ పూసలు, మైక్రో లెటర్‌ ప్రింటింగ్, సెక్వెన్షియల్ నంబర్ సిరీస్, హిడెన్ రిప్లికేషన్ వంటి ఫీచర్లతో రూ.100 నోట్లలో అనేక మార్పులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పాలిమర్ 100 రూపాయల నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న 100 రూపాయల నోటు 2018లో విడుదలైంది. ఇది కొత్త మహాత్మా గాంధీ సిరీస్ నోటు. ఇది 66 మి.మీ x 142 మి.మీ. పరిమాణంలో ఉంటుంది. ఈ నోటు ప్రత్యేకంగా సెక్యూరిటీ థ్రెడ్, రాణీ కి వావ్ ఫీచర్, హిడెన్ 100 నెంబర్లు, హిడెన్ గాంధీ చిత్రం వంటి భద్రతా ఫీచర్లు కలిగి ఉంది. అందువల్ల దీన్ని నకిలీ చేయడం అసాధ్యం.

ఒకవేళ మీ దగ్గర పాత, చిరిగిన రూ.100 నోట్లు ఉంటే ఏ బ్యాంకులోనైనా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు ఎలాంటి ఫీజు చెల్లించక్కరలేదు. బ్యాంకుకు వెళ్లి ఫారం నింపి చిరిగిన, పాత నోటును ఇస్తే వారు దాని గుర్తింపును చెక్ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే కొత్త నోట్లు ఇస్తారు. అయితే వాటిపై నంబర్ సిరీస్ సరిగా, స్పష్టంగా ఉండాలి. ఆ నంబర్ సిరీస్ కనిపించకపోతే ఎక్కడా ఆ నోట్లను తీసుకోరు.

అదేవిధంగా కరెన్సీ నోట్లపై లెటర్స్, నంబర్స్ రాస్తే మార్కెట్ లో ఎక్కడా ఎక్కువ తీసుకోరు. నోట్లను ఎక్కువ మడతలు పెట్టినా, అతికించినా, తడిపినా షాపుల్లో తీసుకోరు. ఇలాంటివి మీ దగ్గర ఉంటే వెంటనే మీ సమీపంలోని బ్యాంకులకు వెళ్లి కొత్త నోట్లు తీసుకోండి.

సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్న పాత రూ.100 నోట్లు చెల్లవన్న వార్తల విషయంపైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. పాత నోట్లను రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని RBI విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేల్చేసింది. పాత రూ.100 నోట్లు చెల్లుతాయని, అన్ని చోట్లా వాడుకోవచ్చని స్పష్టం చేసింది. వీటిని ఎవరైనా తీసుకోమని చెబితే ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ కూడా చేయొచ్చని తెలిపింది..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are old Rs.100 notes valid? Explanation of RBI."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0