Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What causes asthma.. What are the symptoms.. How to reduce it.. What to do to prevent it.

 Good Health: ఆస్తమా ఎందుకొస్తుంది.. లక్షణాలు ఏంటీ.. ఎట్లా తగ్గుతుంది.. రాకుండా ఏం చేయాలో వివరణ.

ఆస్తమా... ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి, చాలా మందిని వేధిస్తున్న సమస్య. తిండి, అలవాట్లు, జీన్స్ వల్ల.... ఇలా ఎన్నో కారణాలతో వచ్చే ఆస్తమాను అవగాహనతో దూరంగా పెట్టొచ్చు.

వచ్చినా దానిని తెలివిగా తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఆస్తమాతో బాధపడేవాళ్లు పల్లెటూళ్లలో కంటే పట్టణాల్లోనే ఎక్కువ. పేదల కంటే మధ్య తరగతికి చెందిన వాళ్లు, ధనికులే ఎక్కువగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఇలా ఎందుకు బాధ పడుతున్నారో తెలుసుకోండి.

ధుమ్ము, ధూళి, వాసనలు, వాయువులు మరేదైనా పదార్థం ఎక్స్ పోజ్ అయినప్పుడు శరీరం ఓవర్​ గా రియాక్ట్ అయితే దానిని అలర్జీ (హైపర్ సెన్సిటివిటీ) అంటారు. శరీర భాగాల్లో అలర్జీ ఎక్కడైనా రావొచ్చు. శరీరం ఓవర్ గా రియాక్ట్ అయ్యే గుణం కొందరిలో పుట్టుకతోనే ఉంటుంది. అలర్జీ వయసు పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ పోవచ్చు. లేదా అలాగే ఉండిపోవచ్చు.

ఆస్తమా ఎందుకొస్తుంది?

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, గాలిలో ధుమ్ము, ధూళి, గాలిలోని కలుషిత వాయువులు, కొన్నిరకాల వాసనలు, బ్యాక్టీరియా, వైరస్​లకు కొందరి ఊపిరితిత్తులు అతిగా స్పందిస్తాయి. దీనినే ఆస్తమా అంటారు కిచెన్లో పోపుల వాసన, మస్కిటో కాయిల్స్, అగరబత్తీలు, సెంట్స్, డియోడరెంట్స్, పౌడర్లు,స్ప్రేలు స్మోక్​, ఘాటైన రసాయనాల వాసనలు, ఎయిర్ ఫ్రెషనర్స్ పడకపోతే ఆస్తమా వస్తుంది. పక్కవాకు పొగతాగినా ఆస్తమా వస్తుంది.

ఆస్తమాకు ప్రధానమైన కారణం పొల్యూషన్.. డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్న గాలి పీల్చితే ఆధూళి కణాలు ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలిగిస్తాయి. గాలిలో ఉండే కాలుష్య సంబంధ వాయువులు కార్బన్ మోనాక్సైడ్, కార్బన్- డై- ఆక్సైడ్ ఊపిరితిత్తుల్లో ఇరిటేషన్ కలిగిస్తాయి. బయటి కాలుష్యమే కాదు ఇండోర్ అంటే ఇంటి కాలుష్యం కూడా ఆస్తమాకి కారణమువుతుంది. ఏసీలు, ఫ్రిజ్లో నుంచి విడుదలయ్యే వాయువుల ప్రబావం వల్ల కూడా ఆస్తమా సమస్య వస్తుంది.

అస్తమా లక్షణాలేమిటి?

ఆస్తమాకు కారణం ఏదైనా సరే లక్షణాలు మాత్రం ఒకే తీరుగా ఉంటాయి. దగ్గు, పిల్లికూతలు , ఆయానం, ఛాతీ టైట్ గా ఉండటం ఆస్తమా లక్షణాలు . ఆస్తమా వల్ల లంగ్స్ కు ఉండే వాయు నాళాలు కుంచించుకుపోతాయి. ఆస్తమా పెరుగుతున్న కొద్దీ టిష్యూస్​ లో వాపు వస్తుంది. కఫం తయారవుతుంది. దానిని బయటికి నెట్టడం కోసం దగ్గు వస్తుంది. ఆస్తమాతో బాధపడేవాళ్లు సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సమస్య ముదిరితే వాయు నాళాలకు ఆక్సిజన్ సరిగా అందదు. ఒక్కోసారి ప్రాణంపోయే ప్రమాదముంది

ఎట్లా తగ్గుతుంది?

ఆస్తమా జీన్స్​కు సంబంధించినది చిన్నప్పుడే. (రెండేళ్లలోనే) బయటపడుతుంది. శరీరంలో సహజ మార్పుల వల్ల స్కూల్ ఏజ్ లోనే ఎక్కువ మందిలో తగ్గుతుంది. బాడీ రియాక్ట్ కావడం నెమ్మదిగా తగ్గుతుంది. కొందరిలో వయసు పెరిగినా అస్తమా పోరు ఆస్తమాను మందులతో కంట్రోల్ చేయొచ్చు. కానీ పూర్తిగా తగ్గించలేము.. ఆస్తమాతో బాధపడేవాళ్లలో ఇన్ హేలర్స్ ... మూసుకుపోయిన వాయునాళాలను తెరుచుకునేలా చేస్తాయి.ఇండోర్ అంటే ఇంటి కాలుష్యం కూడా ఆస్తమాకి కారణమువుతుంది. ఏసీలు, ఫ్రిజ్లో నుంచి విడుదలయ్యే వాయువుల ప్రబావం వల్ల కూడా ఆస్తమా సమస్య వస్తుంది.

మూసుకుపోయినట్లుగా మారిన వాయు నాళాన్ని మందులతో మళ్లీ పూర్తిగా తెరుచుకునేలా చేయొచ్చు. ఆస్తమా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ వాడితే మామూలు స్థితికి వస్తుంది. చాలా ఏళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లలో వాయునాళం పూర్తిగా పూర్వ స్థితికి రాకపోవచ్చు కానీ, కొంత మేరకు తెరుచుకునేలా చేస్తారు.

సీఓపీడీ ఆస్తమా తగ్గుతుందా?

ఇది చాలా కాలంగా స్మోకింగ్ చేసేవాళ్లకు వస్తుంది. పక్కన ఉండేవాళ్లు స్మోకింగ్ చేసినప్పుడు ఆ పొగ పీల్చే వాళ్లకూ వస్తుంది. ఇది కూడా సాధారణ ఆస్తమాలో వాయు వాళాలు కుంచించుకు పోయినట్లే అవుతుంది. దగ్గు, ఆయాసం వస్తుంది. సాధారణ ఆస్తమా వల్ల మూసుకుపోయిన వాయునాళాలను పూర్వ స్థితికి తీసుకురావచ్చు. కానీ సీఓపీడీ ఆస్తమా బాధితుల్లో వాయు నాళాలను పూర్వ స్థితికి తీసుకురావడం సాధ్యం కాదు.

సాధారణంగా వైరస్​, బ్యాక్టీరియా, ఫంగస్​

వాయు నాళాల్లోకి ప్రవేశిస్తే ఆస్తమా వస్తుంది. వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు అవి ఒక రోజు కంటే ఎక్కువ కాలం ఉంటాయి. ఆ సమయంలో అవి ఊపిరితిత్తుల కణాల్లోకి చొచ్చుకొని పోతాయో అప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్దులు, కిడ్నీ, హార్ట్, ఆస్తమా, డయాబెటిస్ బాధితులు ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురవుతుంటారు. ఈ ఇన్ఫెక్షన్లు ప్రమాదకరమైనవి.

వ్యవసాయ పనుల్లో ఉన్న ఆరోగ్యవంతుల ఊపిరితిత్తులకు కూడాఅలర్జీ వస్తుంది. పొలంలో ఎరువులు చల్లుతున్నపుడు,పురుగు మందులు పిచికారీ చేస్తున్నప్పుడు అవి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. పత్తి చేలల్లో పనిచేస్తున్నప్పుడు దూది రేణువులు గాలిలో కలుస్తుంది. దానిని పిల్చితే ఊపిరితిత్తుల్లోఇరిటేషన్ ఏర్పడుతుంది.

ఊపిరితిత్తులకు అలర్జీ రాకుండా ఉండాలంటే.

అలర్జీకి కారణం ఏమిటో ముందుగా గుర్తించాలి. దానిని ఎప్పుడూ ఎవయిడ్ చేయాలి.

కొన్ని రకాల అలర్జీలను డీ సెన్సిటైజ్ చేయొచ్చు. అలా చేయాలంటే మందులు వాడుతూ డాక్టర్లు చెప్పినవి తింటూ వాళ్లు చెప్పిన జాగ్రత్తలు పాటించాలి.

ఇమ్యూనిటీని ఇంప్రూవ్​ చేసుకోవాలి.

  • వయసు, ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
  • హెల్దీగా ఉండేందుకు బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి బరువు పెరగకుండా ఉండే తిండి తినాలి.
  • ఒబెసిటి ఉంటే ఇతర సమస్యలు ఉంటాయి
  • వ్యాయామం చేస్తూ ఆహారంలో మార్పులు చేసుకోవాలి
  • వ్యాయామం చేస్తూ శారీరక శ్రమ ఉండే పనులు చేస్తూ శరీరాన్ని దృఢంగా ఉండేలా చూసుకోవాలి.
  • కొన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వృద్ధులు. పిల్లలకు అవి అవసరాన్ని బట్టి ఇవ్వొచ్చు.
  • టీబీ, స్యుమోనియా, ఫ్లూకి వ్యాక్సిన్లు తీసుకోవాలి.
  • ఫ్లూకి ప్రతి ఏడాది వ్యాక్సిన్ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న ముసలివారికి ఆరు నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు ఇవ్వాలి..
  • స్మోకింగ్​ కారణమైతే మానేయాలి.
  • మానలేకపోతే డీ ఎడిక్షన్ మందులు వాడి అయినా సరే స్మోకింగ్ మావేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What causes asthma.. What are the symptoms.. How to reduce it.. What to do to prevent it."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0