Are you skipping dinner to lose weight.. But you can notice this.
బరువు తగ్గాలని రాత్రి భోజనం మానేస్తున్నారా.. అయితే ఇది గమనించగలరు.
అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. నిజానికి బరువు ఎక్కువగా ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత వరకు బరువును తగ్గించుకోవడం మంచిది.
బరువు తక్కువ వున్నా ఎక్కువ వున్నా ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు రాత్రిపూట భోజనం మానేస్తూ ఉంటారు. రాత్రి భోజనం మానేసి కొవ్వుని తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎంత ముఖ్యమో.. రాత్రి భోజనం కూడా అంతే ముఖ్యం.
రాత్రి తినే ఆహారంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. రాత్రి భోజనం చేయడం వలన బరువు తగ్గడానికి సరైన ఆహార పదార్థాలను ఎంచుకోవడం మంచిది. అయితే రాత్రిళ్ళు బాగా హెవీగా తీసుకున్నట్లయితే, కచ్చితంగా ఇబ్బందిగా ఉంటుంది. నిద్ర కూడా పట్టదు. గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే.. రాత్రిపూట ఆహారాన్ని తీసుకోకుండా ఉంటే కచ్చితంగా కొవ్వు తగ్గిపోతుంది అని. కానీ అలా ఎప్పుడూ చేయకండి.
ఎందుకంటే రాత్రి భోజనం చేయకపోవడం వలన అలసట, బలహీనంగా అయిపోవడం వంటివి కలుగుతుంటాయి. ఖాళీ కడుపుతో నిద్రపోవడం మంచిది కాదు. లైట్ గా డిన్నర్ ని తీసుకోండి. రాత్రిపూట కనుక మీరు తినడం మానేస్తే మళ్ళీ ఉదయం వరకు ఏ ఆహారాన్ని కూడా తీసుకోకపోవడంతో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం, వికారంగా ఉండడం, జీవక్రియలోపాలు, అజీర్తి లాంటివి కలుగుతూ ఉంటాయి.
బరువు తగ్గడానికి ముందు ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటిని తీసుకోవద్దు. రాత్రి 8 గంటల లోపు భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రాత్రి కూడా లైట్ గా ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గవచ్చు. రోజూ నాలుగైదు సార్లు ఆహారాన్ని తీసుకుంటూ ఉండండి. భోజనం మధ్యలో విరామం ఇవ్వండి. కనీసం నాలుగు గంటలలోగా ఆహారాన్ని తీసుకోండి. ఇలా మీరు పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే లేనిపోని ఇబ్బందులు వస్తుంటాయి.
0 Response to "Are you skipping dinner to lose weight.. But you can notice this."
Post a Comment