Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ICG Recruitment 2024

 ICG Recruitment 2024  10th, 10+2 తో ఉద్యోగాల భర్తీ  Apply here

10th, 10+2 అర్హత లతో భారత తీర రక్షక దళం లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.., ఆసక్తి కలిగిన భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోండి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మాత్రం మిస్ అవ్వకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. డైరెక్ట్ ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగాల భర్తీ.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం, మెట్రిక్యులేషన్/ 10వ తరగతి/ 12వ తరగతి అర్హతతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత "జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్-సి నాన్-గెజిటెడ్, నాన్-మినిస్ట్రీయల్" పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు 14.09.2024 నుండి ఆన్లైన్ దరఖాస్తులను 28.10.2024 వరకూ, లేదా అంతకంటే ముందు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోగలరు.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య : 11.

విభాగాల వారీగా ఖాళీలు:

  • స్టోర్ కీపర్ గ్రేడ్ 2 - 01,
  • ఇంజన్ డ్రైవర్ - 01,
  • సరంగ్ లాస్కార్ - 05,
  • మోటర్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) - 01,
  • లాస్కార్ 1స్ట్ క్లాస్ - 01,
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (Peon) - 01,
  • రిగ్గర్ - 01.

విద్యార్హత:

పోస్టులను అనుసరించి.. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, మెట్రిక్యులేషన్, ఇంటర్మీడియట్ అర్హత కలిగి సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

28.10.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.

అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. 

పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవగలరు .

ఎంపిక విధానం:

దరఖాస్తు స్క్రూటినీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్ ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం:

దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.

దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ కు జత చేయబడింది.

దరఖాస్తు ఫీజు :: లేదు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.09.2024 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 28.10.2024 

ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

The Commander, Coast Guard Region(A&N), Post Box No.716, Haddo (PO), Port Blair 744102, A&N Island.

అధికారిక వెబ్సైట్ :  https://indiancoastguard.gov.in/


ONLINE APPLICATION FORM


N O T I F I C A T I O N

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ICG Recruitment 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0