Electricity Meters
Electricity Meters: ఒక ఇంటికి ఎన్ని విద్యుత్ మీటర్లు ఉండొచ్చు..? రూల్స్ ఇవే.
ఈరోజుల్లో కరెంట్ లేనిదే ఏ పనీ జరగట్లేదు. అసలు విద్యుత్ లేకపోతే ప్రపంచం మొత్తం అంధకారం అవుతుంది. కరెంట్ లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది.
మన దేశంలో ప్రతి ఇంటికీ ఒక విద్యుత్ మీటర్ ఉంటుంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ కాల్చామో ఆ రీడింగ్‌ని ఈ మీటర్ చూపిస్తుంది. అయితే, ఒక ఇంటికి ఎన్ని విద్యుత్ మీటర్లు అమర్చవచ్చో మీకు తెలుసా? ఒకే ఇంటికి రెండు కరెంటు మీటర్లు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
సాధారణంగా ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ ఇంటిని బట్టి విద్యుత్ మీటర్‌ను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంటుంది. ఫ్లాట్ లేదా ఇల్లుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేస్తే విద్యుత్ మీటర్ వస్తుంది. రూల్స్ ప్రకారం ఒక ఇంటికి ఒకే విద్యుత్ మీటర్ ఉండాలి. అంటే, ఒక రిజిస్ట్రీపై ఒక మీటర్‌ను మాత్రమే జారీ చేస్తారు. కాబట్టి, ఇక ఇంటిపై రెండు విద్యుత్ మీటర్లు పెట్టుకోవడం సాధ్యం కాదు. రెండు మీటర్లు సెటప్ చేసుకోవడమనేది చట్ట విరుద్ధమైన చర్యగా పరిగణిస్తారు.
అపార్ట్‌మెంట్లలో మీటర్లన్నీ ఒకే దగ్గర కనిపిస్తుండటం మీరు గమనించే ఉండొచ్చు. మరి, అపార్ట్‌మెంట్ మొత్తానికి ఒకే విద్యుత్ మీటర్ ఉండాలి కదా? అనే సందేహం మీకు కలగొచ్చు. రూల్స్ ప్రకారం అయితే ఒకటే ఉండాలి. కానీ, అపార్ట్‌మెంట్లలో ఎన్నో ఫ్లాట్లు లేదా పోర్షన్లు ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ఒకే మీటర్ పెట్టడం అనేది టెక్నికల్‌గా సాధ్యం కానిది.
కాబట్టి, అపార్ట్‌మెంట్ బేసిస్ కింద కాకుండా ఫ్లాట్ల బేసిస్ మీద ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సపరేట్ విద్యుత్ మీటర్ పొందవచ్చు. అంటే, ఒక్కో ఫ్లాట్‌కి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏదైనా ఫ్లాట్ లేదా ఇల్లులో మరో భాగానికి సపరేటు రిజిస్ట్రేషన్ ఉంటే రెండో విద్యుత్ మీటర్ పొందొచ్చని రూల్స్ చెబుతున్నాయి. ఇలా సపరేటు మీటర్ ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు. బిల్డింగులో ఎక్కువ పోర్షన్లు ఉంటే ఇంటి యజమాని పేరు మీద కూడా అదనపు విద్యుత్ మీటర్ దరఖాస్తు చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అయితే, విద్యుత్ ప్రొవైడర్‌ను బట్టి ఈ రూల్స్‌లో తేడా ఉంటుందని గమనించాలి.
ఒకే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉంటే విద్యుత్ వినియోగం పెరిగిపోయి కరెంట్ బిల్లు మోత మోగుతుంది. యూనిట్ల రేంజ్‌ని బట్టి ధర డిసైడ్ అవుతుంది కాబట్టి, లిమిట్‌కి మించి విద్యుత్ వాడితే యూనిట్ ధర పెరిగి భారీగా బిల్లు జనరేట్ అవుతుంది. దీంతో ప్రతి ఒక్కరిపై అదనపు భారం పడుతుంది. కొన్నిసార్లు ఈ బిల్లు గొడవలకు దారితీయొచ్చు.
కొత్త రూల్స్ ప్రకారం ఒకే ఇంట్లో ఉండే జాయింట్ ఫ్యామిలీలు సపరేటు మీటర్ ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు. అయితే, ప్రతి ఫ్యామిలీకి కిచెన్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే విద్యుత్ శాఖ అదనపు మీటర్లను జారీ చేస్తుంది. ఇక అద్దె భవనాలకు రెంటల్ అగ్రీమెంట్ చేయించుకోవాలి. ఈ రెంట్ అగ్రీమెంట్ ఆధారంగానే సపరేటు విద్యుత్ మీటర్ వస్తుంది. అయితే, రెంటల్ అగ్రీమెంట్ చేసుకున్న 3 నెలల్లోపే విద్యుత్ మీటర్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
లోడ్‌ను బట్టి కనెక్షన్
విద్యుత్‌లో సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ అని ఉంటాయి. గృహ అవసరాలకు సింగిల్ ఫేజ్ మీటర్ కనెక్షన్ ఉంటుంది. 1 కిలోవాట్ నుంచి 4 కిలోవాట్ల లోడ్‌ని ఈ మీటర్ భరించగలదు. ఒకవేళ లోడ్ 4 కిలోవాట్ల కన్నా ఎక్కువైతే త్రీ ఫేజ్ కనెక్షన్ తీసుకోవాలి.
0 Response to "Electricity Meters"
Post a Comment