New Fees in AP - Guidelines, Release
ఏపీలో కొత్త ఫించన్లు - మార్గదర్శకాలు, విడుదల
Ap ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నెలలుగా వేచి చూస్తున్న పెన్షన్ లబ్ది దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్హత ఉన్న వారికి కొత్త ఫించన్లను వచ్చే జనవరి నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే అధికారులు మార్గదర్శకాలు సిద్దం చేసారు. పెన్షన్ పొందుతున్న అనర్హులను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వారికి ఫించన్లు రద్దు చేస్తూ..అర్హత ఉన్న వారికి అమలు చేసేలా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది.
కొత్త ఫించన్ల కోసం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను రూ 4 వేలకు పెంచింది. ప్రతీ నెలా సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పంపిణీ చేస్తోంది. ఇక..వైసీపీ హాయంలోనే అనేక మంది తమకు పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న వారికి జనవరి నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. జనవరిలో జన్మభూమి -2 ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామ సభల్లో కొత్త ఫించన్లు పంపిణీ మొదలు పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
జన్మభూమి -2 ప్రారంభం
కొత్త ఫించన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మార్గదర్శకాలు సిద్దం చేస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద సంఖ్యలో పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నాలుగు నెలల కాలంలో వారిని ప్రభుత్వం గుర్తించింది. అనర్హులను పెన్షన్లను తెలిగిస్తూ అర్హత ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద లక్షల సంఖ్యలో పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్ల లో నకిలీ లబ్దిదారులు ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. చేనేత ఫించన్లలోనూ అర్హత లేకుండానే లబ్ది పొందుతున్న వారిని గుర్తించారు.
గ్రామ సభల్లోనే
కొత్త ఫించన్ల మంజూరు తో పాటుగా అనర్హుల ఏరివేత కోసం ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయనుంది. దీంతో, అధికారులు ఇచ్చిన నివేదిక పైన ఈ ఉప సంఘం అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. కొత్త ఫించన్ల కోసం కొత్తగా దరఖాస్తుల స్వీకరణ పైనా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. వచ్చే నెల నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించనున్నారు. అదే విధంగా అర్హులను గుర్తించి గ్రామ సభల్లోనే ప్రకటన చేయనున్నారు. మొత్తం విధాన పరమైన ప్రక్రియ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జనవరిలో కొత్త ఫించన్ల అమలు ప్రారంభించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు.
0 Response to "New Fees in AP - Guidelines, Release"
Post a Comment