Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Karthika Masam 2024 Start and End Date

 Karthika Masam 2024 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

Karthika Masam 2024 Start and End Date

దీపావళి అమావాస్యతో ఆశ్వయుజమాసం ముగుస్తుంది. ఆ మర్నాటి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబరు 31 న దీపావళి వచ్చింది.

నవంబరు 1 సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో.. నవంబరు 2 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది.

బ్రహ్మ ముహూర్తంలో కార్తీకస్నానం, దీపంతో కార్తీకమాసం ప్రారంభిస్తారు. సుర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీకమాసం ప్రారంభంగా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే నవంబరు 02 న కార్తీకమాసం ప్రారంభమవుతోంది.

2024 నవంబరు 02 శనివారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి

నవంబరు 03 ఆదివారం యమవిదియ - భగినీహస్త భోజనం -భాయ్ దూజ్

నవంబరు 04 కార్తీకమాసం మొదటి సోమవారం

నవంబరు 05 మంగళవారం నాగులచవితి

నవంబరు 06 బుధవారం నాగపంచమి

నవంబరు 09 శనివారం కార్తావీర్యజయంతి

నవంబరు 11 కార్తీకమాసం రెండో సోమవారం - యజ్ఞావల్క జయంతి

నవంబరు 12 మంగళవారం మతత్రయ ఏకాదశి

నవంబరు 13 బుధవారం క్షీరాబ్ది ద్వాదశి

నవంబరు 15 శుక్రవారం జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2024), కేదారనోములు,గురునానక్ జయంతి

నవంబరు 16 శనివారం వృశ్చిక సంక్రాంతి

నవంబరు 18 కార్తీమాసం మూడో సోమవారం

నవంబరు 19 మంగళవారం సంకటహర చతుర్థి

నవంబరు 25 కార్తీకమాసం నాలుగో సోమవారం

నవంబరు 26 మంగళవారం ఏకాదశి

నవంబరు 29 శుక్రవారం మాస శివరాత్రి

నవంబరు 30 శనివారం అమావాస్య తగులు

డిసెంబరు 01 ఆదివారం అమావాస్య మిగులు - పోలిస్వర్గం

కార్తీకమాసంలో సోమవారం, జ్వాలాతోరణం ..పరమేశ్వరుడి ప్రాముఖ్యత తెలియజేస్తే.. బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యత తెలియజేస్తున్నాయ్. కార్తీకపురాణంలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి తెలియజేస్తున్నాయ్. ఈ ఏడాది నవంబరు 02 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది... డిసెంబరు 01 తో ముగుస్తోంది..

న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం

నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్

కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం.

కార్తీకం నెల రోజులు నియమనిష్టలు పాటిస్తారు. ఈ నెల రోజులు నియమాలు పాటించేవారు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు అది కూడా రోజుకి ఒకసారి మాత్రమే. వర్షాకాలం పూర్తై..చలి పెరిగే సమయం కావడంతో ఈ నెల రోజులు చేసే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. దుప్పట్లు, స్వెట్టర్లు, కంబళ్లు దానం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలను ఎంత గోప్యంగా చేస్తే అంత మంచి ఫలితం పొందుతారు.

కార్తీకమాసంలో వీటికి దూరంగా ఉండండి

  • కార్తీకమాసం నియమాలు పాటించేవారు వెల్లుల్లి, ఉల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి
  • ఈ నెల రోజులు ఓ నియమంలా పాటించి..ప్రతికూల ఆలోచనలకు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది
  • నమ్మకం ఉంటే దేవుడిని పూజించండి..లేదంటే మానేయండి..ఎట్టిపిరిస్థితుల్లోనూ దైవదూషణ మాత్రం చేయొద్దు
  • ఈ నెల రోజులు దీపారాధన కోసం మాత్రమే నువ్వుల నూనె వినియోగించండి.. ఒంటికి రాసుకునేందుకు వద్దు
  • కార్తీకంలో మినుములు తినకూడదు.. నలుగుపెట్టుకుని స్నానమాచరించడం లాంటివి చేయకూడదు
  • కార్తీకమాసం నియమాలు పాటించేవారు.. ఈ నియమాలు పాటించని వారిచేతి వంట తినకూడదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Karthika Masam 2024 Start and End Date"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0