Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PGCIL Bharti 2024

 PGCIL Bharti 2024 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (PGCIL).. భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

PGCIL Bharti 2024

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 117 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో 47 ట్రైనీ ఇంజినీర్‌, 70 ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి వేర్వేరు ప్రకటనలను విడుదల చేసింది. ఈ పోస్టులకు డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ, గేట్‌-2024 స్కోరుతో అప్లయ్‌ చేసుకోవచ్చు. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 6 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.powergrid.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టులు 117

  • ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు - 70
  • ట్రైనీ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) - 47

ట్రైనీ సూపర్‌వైజర్ పోస్టులు - 70

అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి : 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.24,000 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : రూ.300.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

రాతపరీక్ష కేంద్రాలు : నాగ్‌పూర్‌, భోపాల్‌, బెంగళూర్‌, చెన్నై నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

ఎంపిక విధానం : రాతపరీక్ష/కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 06.11.2024

N O T I F I C A T I O N

ట్రైనీ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) - 47

అర్హత : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ స్కోర్‌ తప్పనిసరిగా ఉండాలి.

వయో పరిమితి : 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ.30,000 వేతనం ఉంటుంది.

దరఖాస్తు ఫీజు : రూ.500.. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం : గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరితేది: 06.11.2024

N O T I F I C N T I O N


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PGCIL Bharti 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0