Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

They have 100 times more calcium than milk.. The cost is very low

 Calcium : పాల కంటే వీటిల్లో 100 రెట్ల కాల్షియం ఎక్కువ.. ఖర్చు బాగా తక్కువ.

పాలు ఆరోగ్యానికి చాలా మంచివని చాలామంది పాలని తీసుకుంటూ ఉంటారు. పాలను తీసుకోవడం వలన అనేక లాభాలని పొందొచ్చు. పాలల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.

అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఆహార పదార్థాల గురించి తెలుసుకుని మీరు వాటిని తీసుకున్నట్లయితే, ఎక్కువ కాల్షియం పొందొచ్చు. వీటిలో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుందట. మరి ఇక ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలను చూసేద్దాం.

పాలల్లో క్యాల్షియం తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. పాలు తాగడం వలన ఎముకలు దృఢంగా ఉంటాయి. దానితో పాటుగా, ఇతర లాభాలను మనం పాల ద్వారా పొందవచ్చు. అయితే, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. మరి ఇక వాటి గురించి తెలుసుకుందాం. నీళ్లు కలపని గేదె పాలల్లో చూసుకున్నట్లయితే, 220 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అదే నీళ్లు కలిపితే 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఆవు పాలలో 120 మిల్లి గ్రాముల క్యాల్షియం ఉంటుంది.

అయితే, గోరుచిక్కుడు లో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల గోరు చిక్కుడు లో 130 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. శనగలలో 202 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. బాదంపప్పులో చూసుకున్నట్లయితే, 100 గ్రాముల బాదం లో 230 మిల్లీగ్రాముల క్యాల్షియం, 100 గ్రాముల సోయాబీన్స్ లో 240 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఉలవల్లో చూసుకున్నట్లయితే, 100 గ్రాములు ఉలవల్లో 287 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

రాగులలో 344 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల గోంగూరలో, 344 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల మెంతికూరలో 395 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల ఎండు కొబ్బరిలో 400 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది.

100 గ్రాముల మునగాకులో 440 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల పొన్నగంటి కూరలో 510 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇలా, ఈ ఆహార పదార్థాలలో పాల కంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి పాలే తీసుకోకర్లేదు. క్యాల్షియం ని పొందడానికి, పాల కంటే ఎక్కువ కాల్షియం ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "They have 100 times more calcium than milk.. The cost is very low"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0