15 banks are closing forever! Do you know many Telugu states?
15 బ్యాంకులు శాశ్వతంగా మూసేస్తున్నారు! తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో తెలుసా?
బ్యాంకులను మెర్జ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మళ్లీ చర్యలు తీసుకుంటోంది. 43 బ్యాంకులను 28కి చేయాలని పరిశీలిస్తోంది. దీంతో ఇకపై దేశం మొత్తం మీద మరో 15 బ్యాంకులు మూతపడనున్నాయని సమాచారం.
మీకు గ్రామీణ బ్యాంకులో బ్యాంకు అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులను మెర్జ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం 15 బ్యాంకుల పేర్లు ఇప్పటికే సిద్ధమైనట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రం.. ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 43 గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ సంఖ్యను 28కి తగ్గించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ గురించి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.. ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు విలీనం అవుతాయని అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రూరల్ బ్యాంకులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో మూడు RRBలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, బీహార్, ఒడిశా, రాజస్థాన్‌లలో రెండు RRBలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, త్రిపుర, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, చైతన్య గోదావరి, సప్తగిరి, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. అదే తెలంగాణాలో అయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒకటే ఉంది. మీకు కాని ఈ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉంటే అవి విలీనం అవుతున్నాయని తెలుసుకోండి. ప్రస్తుతానికి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు కెనరా బ్యాంకు స్పాన్సర్ చేస్తోంది. అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుకు యూనియన్ బ్యాంకు, సప్తగిరి బ్యాంకుకు ఇండియన్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి బ్యాంకుకు ఎస్బీఐ పెట్టుబడి సాయం అందిస్తున్నాయి. తెలంగాణలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు కూడా ఎస్బీఐ స్పాన్సర్ గా ఉంది.
రూరల్ బ్యాంకుల విలీనం గురించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌ను సంప్రదించింది. ఇప్పటికే RRBల విలీనానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులు ఉండగా, ఈ విలీనం తర్వాత దేశంలో గ్రామీణ బ్యాంకుల సంఖ్య 28కి తగ్గిపోతుంది. ఇప్పటికే మెర్జ్ కానున్న బ్యాంకుల అధిపతులను కేంద్ర ఆర్థిక సేవల విభాగం అభిప్రాయాలు కోరింది. వీటిని ఈ నెల అంటే నవంబర్ 20 నాటికి తెలపాలని కోరింది.
గ్రామీణ బ్యాంకులను 1975వ సంవత్సరంలో సెప్టెంబర్ 27న స్థాపించారు. ఆ సంవత్సరంలో జారీ చేసిన ఆర్డినెన్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం ప్రకారం ఈ బ్యాంకులను వ్యవసాయాభివృద్ధికి, ఆ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్యాలు అభివృద్ధి చేయడానికి నెలకొల్పారు.
అప్పట్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 196 బ్యాంకులు ఉండేవి. ఇప్పటికే జరిగిన మూడు దశల విలీనం తర్వాత RRBల సంఖ్య 196 నుండి 43కి తగ్గింది. ఇప్పుడు 43 నుంచి 28కి తగ్గనుంది. మీకు గాని ఈ బ్యాంకుల్లో అకౌంట్ ఉంటే విలీనం అవుతున్నాయని మర్చిపోకండి.
0 Response to " 15 banks are closing forever! Do you know many Telugu states?"
Post a Comment