AP Cabinet
AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు కేబినెట్ ఆమోదం.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
10 అంశాలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.
పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలో పనుల చెల్లింపులు: 2014-15 నుండి 2018-19 సంవత్సరాల మధ్య పూర్తి అయిన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి పనుల బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొటెక్షన్ బిల్ 2024: 1982 లో వచ్చిన “ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్” స్థానంలో 2024 లో కొత్త ముసాయిదా బిల్‌ను ప్రవేశపెట్టడం కేబినెట్ ఆమోదించింది.
ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 సవరణ: జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసును 60 నుండి 61 సంవత్సరాలకు పెంచేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ 2024 నవంబర్ 1 నుండి అమలులోకి రానుంది.
ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్ 2024: ఈ సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024: కేబినెట్ ఆమోదించిన మరో కీలక నిర్ణయం. దీనిలో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024 కు కూడా ఆమోదం ఇచ్చారు.
స్పెషలైజ్డ్ డెవలప్‌మెంట్ అథారిటీలు: కుప్పం , పిఠాపురం ప్రాంతాలలో ఎరియా డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటుచేసేందుకు కేబినెట్ ఆమోదించింది. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ నాలుగు మండలాలను, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ స్థాపించబడింది.
సీఆర్డీఏ పరిధి విస్తరణ: సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పల్నాడు జిల్లా 92 గ్రామాలు, బాపట్ల జిల్లా 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి చేర్చేలా కేబినెట్ నిర్ణయించింది.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిస్బర్సల్: 2024-25 విద్యా సంవత్సరంలో నుండి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ను విద్యార్థుల కళాశాల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయడం సాధ్యం అవుతుంది.
అదనపు నిర్ణయాలు: 2024 జూన్ 24 నుండి అక్టోబర్ 23 వరకు తీసుకున్న మంత్రివర్గ నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా చర్చ జరిగింది.
ఈ కీలక నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా రంగం తదితర విషయాల్లో దిశా నిర్దేశం చేయడం జరిగినది.
0 Response to "AP Cabinet"
Post a Comment