Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do you know what symptoms appear in the body before diabetes occurs?

 డయాబెటిస్ వచ్చే ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా.? నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులే.

Do you know what symptoms appear in the body before diabetes occurs?

ICMR నివేదిక ప్రకారం.. దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నారు. జనాభాలో ఎక్కువ భాగం కూడా ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు.. అంటే ఈ వ్యక్తుల్లో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి శరీరంలో వచ్చే ముందు, అనేక రకాల సంకేతాలు కనిపిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించడం అవసరం.

భారతదేశంలో మధుమేహం పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ వస్తోంది.. దీంతో డయాబెటిస్ ఎప్పుడు వస్తుందోనని అందరూ భయపడుతున్నారు. శరీరంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహం వస్తుంది. కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల ఈ జబ్బు వస్తుంది. దీనినే టైప్-1 డయాబెటిస్ అంటారు. అయితే, ఇతర వ్యక్తులకు ఇది చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి కారణంగా వస్తుంది.. దీనినే టైప్-2 అంటారు. జీవనశైలి, ఆహార సంబంధిత కారణాల వల్ల షుగర్ లెవల్స్ పెరగడం నేటి కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.

మధుమేహం కూడా శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలిగించే వ్యాధి. దీని వల్ల కళ్లు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. చక్కెర స్థాయి పెరగడం మొత్తం శరీరానికి ప్రమాదకరం. చాలా సందర్భాలలో, శరీరంలో చక్కెర స్థాయి పెరగడాన్ని ప్రజలు గుర్తించరు. దీనివల్ల ఆరోగ్యం క్షిణించే అవకాశం ఉంది.. అటువంటి పరిస్థితిలో, మీరు మధుమేహం ప్రారంభ లక్షణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం..

మధుమేహం ప్రారంభ లక్షణాలు ఏమిటి?

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం.. డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని పెంచే వ్యాధి. మధుమేహం రాకముందే శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఇది సాధారణంగా పెరుగుతున్న చక్కెర స్థాయిని సూచిస్తుంది.

విపరీతమైన దాహం, తరచూ మూత్రవిసర్జన ద్వారా పసిగట్టవచ్చు.. మీరు ఎక్కువగా మూత్ర విసర్జన చేసినా లేదా మూత్రం ఇన్ఫెక్షన్ లేకుండా ఎక్కువ దాహం వేసినా, అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా షుగర్ స్థాయి పెరిగిందనడానికి సంకేతం కావచ్చు. ఇది కాకుండా, బరువు తగ్గడం, చర్మంపై మచ్చలు కూడా అధిక చక్కెర స్థాయి పెరుగుతుందనడానికి ప్రారంభ లక్షణాలు. వీటిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే వైద్యులను సంప్రదించడం మంచిది.

ఇలాంటి వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ..

అధిక బరువు ఉన్న వ్యక్తులు.. ధూమపానం, మద్యం తాగే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఊబకాయం, మధుమేహం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. ఊబకాయం ఉన్నవారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం.. ఫిట్ వ్యక్తుల కంటే చాలా రెట్లు ఎక్కువ అని అధ్యయనాలు పేర్కొంటున్నాయి..

మధుమేహాన్ని ఎలా నివారించాలి

మీ ఆహారంలో ఎక్కువ తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను చేర్చండి

ప్రతిరోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయండి.

మీ ఆహారంలో విటమిన్ డి ఉండేలా చూడండి..

ప్రతిరోజూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోండి

ధ్యానం చేయండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do you know what symptoms appear in the body before diabetes occurs?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0