Don't give up if you find these super foods that are only available in winter
చలికాలంలో మాత్రమే దొరికే సూపర్ ఫుడ్ ఇవి కనిపిస్తే అస్సలు వదలకండి
ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి మధ్యలో దొరికే తాటి తేగలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.ఇందలో శరీరానికి అవసరమైన పోషక విలువలు ఉండటం వల్ల ఈ సీజన్లో తప్పకుండా తినాల్సిన సూపర్ ఫుడ్ గా వీటిని చెప్తారు.తాటి తేగలు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయోతెలుసుకుందాం.
మలబద్ధకాన్ని తరిమేస్తుంది,చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారికి తాటి తేగల్లో ఉండే ఫైబర్ గొప్పగా పనిచేస్తుంది.పేగుల కదలికలను నియంత్రించడం ద్వారా ఇది కడుపును ఖాళీ చేస్తుంది.మన శరీరం జీర్ణించుకోలేని కార్బోహైడ్రేట్లు,రక్తంలోని కొలెస్ట్రాలు,గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.అంతేకాకుండా బరువు తగ్గేందుకు ప్లాన్ చేసుకుంటున్న వారు కచ్చితంగా మీ డైట్ లో తాటి తేగలను చేర్చుకోండి.ఇవి తింటే కడుపు ఫుల్ గా ఉన్న భావన కలగడంతో పాటు అతిగా తినాలే కోరికను తగ్గిస్తుంది.బలమైన ఎముకలు,దంతాలు ఉంటేనే మనిషి రోజూవారీ పనులు సమర్థంగా చేసుకోగలడు.ఇందుకు కాల్షియం అవసరం ఎంతో ఉంది.తాటి తేగల్లో కాల్షియం పాళ్లు మెండుగా ఉండటం వల్ల ఇది కండరాలు,ఎముకలు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఎముకలను పెలుసుబారిపోయేలా చేసే ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారికి అద్భుతమైన ఆహారంగా చెప్పొచ్చు.అంతేకాకుండా వీటిని తినడం వల్ల ఒంటికి రక్తం పడుతుంది.అంతేకాదు.. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను,దాని పనితీరును పెంచుతుంది.ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.వీటిని ఎండలో ఆరబెట్టి పొడిగా చేసి దానికి బెల్లం కలుపుకుని తింటే మహిళల్లో రక్తహీనత సమస్య ఇట్టే తగ్గిపోతుంది.
0 Response to "Don't give up if you find these super foods that are only available in winter"
Post a Comment