HOW TO PREPARE SCHOOL GRANTS ESTIMATION_DETAILED PROCESS.
HOW TO PREPARE SCHOOL GRANTS ESTIMATION_DETAILED PROCESS.
స్కూల్ గ్రాంట్స్ 2024-25 వాడుకోవడానికి మార్గదర్శకాలు.
2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కూల్ గ్రాంట్స్ విడుదల చేయడం జరిగింది. ఈ గ్రాంట్స్ ను వీలైనంత తొందరగా డ్రా చేసి వాడుకోవాలని తెలపడమైనది. గ్రాంట్స్ ను యుటిలైజ్ చేయడానికి క్రింది మార్గదర్శకాలను అనుసరించాలి.
1) క్రింది లింక్ ను క్లిక్ చేసి PM SHRI యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కేవలం మొబైల్ యాప్ మాత్రమే. కంప్యూటర్ లో యాప్ పని చేయదు. అందరికీ కామన్ పాస్ వర్డ్ Pmshri@2024
2) యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ప్రతి పాఠశాలకు సెపరేట్ గా ఇచ్చిన లాగిన్ ID తో (ఎక్సెల్ షీట్ లో ఇవ్వబడ్డాయి) లాగిన్ అయిన తర్వాత పాఠశాల కు ఎంత మొత్తమైతే మంజూరు అయిందో ( ఎక్సెల్ షీట్ లో ఇవ్వబడింది) అంత మొత్తం దేనికి ఖర్చు పెట్టాలో ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి యాప్ లో HM అప్లోడ్ చేయాలి. ఎస్టిమేషన్ కాపీని పేరెంట్స్ కమిటీ చేత సంతకాలు చేయించి యాప్ లో అప్లోడ్ చేయాలి.
3) ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి పేరెంట్స్ కమిటీ అప్రూవల్ చేయించి యాప్ లో HM అప్లోడ్ చేసిన తర్వాత సంబందిత మండల MEO-2 తన లాగిన్ లో అప్రూవ్ చేయాలి.
4) HM ఎస్టిమేషన్ కాపీని పేరెంట్స్ కమిటీ చేత సంతకాలు చేయించి యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఎస్టిమేషన్ లో ఏఏ అంశాలకైతే ఖర్చు పెట్టాలని తీర్మానించారో ఆ అంశాలకు ఖర్చు పెట్టి వెంటనే బిల్స్ ను యాప్ లో అప్లోడ్ చేయాలి.
5) ఈ గ్రాంట్స్ తో కరెంటు బిల్ బకాయి ఉంటే వాటికి కొంత మొత్తము చెల్లించవచ్చు. బోధన కు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. పాఠశాల కు అత్యవసరమైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. త్రాగునీటి సౌకర్యము నకు సంబందించి రిపేర్ ఉంటే చేయించుకోవచ్చు. పేరెంట్స్ కమిటీ తీర్మానం మేరకు పాఠశాలలో ఏ అవసరానికైనా ఈ మొత్తాన్ని వాడుకోవచ్చు.
0 Response to "HOW TO PREPARE SCHOOL GRANTS ESTIMATION_DETAILED PROCESS."
Post a Comment