Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Memory Power

 Memory Power : ఇది వజ్రంతో సమానం.. ఎంత తింటే.. అంత మేథస్సు, తెలివితేటలు పెరుగుతాయి.

Memory Power

మనం ఎప్పుడు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఎంతో దృఢంగా ఉండాలి. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి విషయాల గురించి అయినా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము.

ఎప్పుడైతే మానసిక ప్రశాంతత తగ్గుతుందో మెదడు పనితీరు మందగిస్తుంది. మెదడు పనితీరులో అవకతవకలు ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి ఏకాగ్రత అనేది నెమ్మదిగా తగ్గుతుంది. మనం చేయాలనుకున్న పనిలో కూడా ఏకాగ్రత లోపిస్తుంది.

అదేవిధంగా ఇష్టాలు, అయిష్టాలపైన కూడా ఏకాగ్రత అనేది ముడిపడి ఉంటుంది. మెదడు పనితీరు సక్రమంగా ఉండి ఏకాగ్రతను పెంచుకోవడానికి ఈ మూడు అంశాలు బాగా ఉపయోగపడతాయి. మరి ఇప్పుడు ఆ అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఏకాగ్రతలేని వ్యక్తికి ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. ఆవలింతలు ఎక్కువగా రావటానికి కారణం మన బ్రెయిన్ వెడేక్కినప్పుడు దాన్ని చల్లార్చడానికి ప్రాణవాయువు ఎక్కువ కావాలి. మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తాయి.


ప్రాణాయామం, వ్యాయామం, ఆసనాలు చేయడం వలన రక్తప్రసరణ శరీరంలో బాగా జరగటంతోపాటు మెదడు కణాలకు ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుంది. నిత్యం ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అదేవిధంగా నిద్ర కూడా ఏకాగ్రతపై ప్రభావం చూపిస్తుంది. నిద్రకు, ఏకాగ్రతకు కూడా సంబంధం ఉంటుంది. నిద్ర సరిగా లేకపోతే మన మెదడు యాక్టివ్ గా ఉండదు.


మెదడు పని చేసినప్పుడు మెదడులోని కణజలమంతా కూడా వ్యర్ధాలను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే మెదడులో వ్యర్ధాలు ఎక్కువగా పేరుకుంటాయో మెదడు పనితీరు అనేది మందగిస్తుంది. మనం నిద్రపోతామో ఆ సమయంలో మెదడు కణాలు రిలాక్స్ అవుతాయి. ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు, టెన్షన్స్ లేకుండా హాయిగా నిద్ర పోతామో మెదడులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. నిద్ర, వ్యాయామాలే కాకుండా తీసుకునే ఆహారం కూడా ఏకాగ్రతపై ప్రభావం చూపుతుంది.

ఉడికిన ఆహారాలు ఏకాగ్రత లోపించేలా చేస్తాయి. ప్రకృతి ప్రసాదించిన ఆహారం ఏకాగ్రతను పెంచే విధంగా ప్రేరేపిస్తాయి. నట్స్, సలాడ్స్, జ్యూస్ లు వంటి నాచురల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలా ఫ్రెష్ ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ లో ఏకాగ్రత పెరిగి చేసే పనిని సక్రమంగా నిర్వహించగలరు. కొబ్బరి, వాల్ నట్స్, బాదం, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల ఏకాగ్రత అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Memory Power"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0