Why rockets are launched from Srihari Kota ?
రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి దేశవ్యాప్తంగా పలు కేంద్రాలు ఉన్నాయి.
తిరువనంతపురంలో ఉపగ్రహ తయారీ కేంద్రం, ఇతర కీలక విభాగాలు ఉన్నాయి.
శ్రీహరికోట ఎందుకంత ప్రత్యేకం?
హసన్, భోపాల్‌లలో రాకెట్లను నియంత్రించే మాస్టర్ కంట్రోల్ కేంద్రం.
హసన్,లఖ్‌నవూ,మారిషస్‌లలో శాటిలైట్ ఎర్త్ సెంటర్లు.
1. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు.
అందులో ఒకటి భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండటం.
ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది.
భూభ్రమణం వల్ల రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.
తూర్పు తీరంలో శ్రీహరికోట ఉంది.తూర్పు దిశ రాకెట్ ప్రయోగాలకు షార్ అనువైన ప్రాంతం.
భూమధ్య రేఖకు శ్రీహరికోట సమీపంగా ఉంది.కౌరూ కేంద్రం తర్వాత అత్యంత అనువైన ప్రాంతం శ్రీహరికోటే.
భూపరిభ్రమణ వేగం భూమధ్య రేఖ వద్ద అధికం ధ్రువాల వద్ద భూపరిభ్రమణ వేగం అస్సలు ఉండదు!గంటకు 1,674 కి.మీ భూమధ్య రేఖ వద్ద భూమి వేగం.
భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతోంది.
రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే, భూపరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది.
అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు.
2. సుదీర్ఘ తూర్పు తీరప్రాంతం!
రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారెంటీ లేదు.
సాంకేతిక కారణాలతో అప్పడప్పుడు రాకెట్‌లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి.
అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణనష్టం జరుగుతుంది.
ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు పులికాట్ సరస్సు
శ్రీహరికోట విస్తీర్ణం43,360 ఎకరాలు,సుమారు 50 కి.మీ శ్రీహరికోట తీరప్రాంతం.ఈ విషయంలో శ్రీహరికోట పూర్తి సురక్షితం. ఎందుకంటే దాని చుట్టూ నీరు ఉంది.
ఈ పరిసరాల్లో పెద్దగా జన సంచారంగానీ, ఇళ్లు కానీ లేవు.
ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినా.. రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ఉండదు.
3. రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయం రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను రాకెట్ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు.
శ్రీహరికోట ఈ పరీక్షలో కూడా పాసైంది.
శ్రీహరికోటకు రోడ్డు, రైలు, జల మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
శ్రీహరికోట నేషనల్ హైవే 5పై ఉంది.
రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్లు,
చెన్నై పోర్టు 70 కిలోమీటర్లు.
4. ప్రయోగాలకు అనుకూల వాతావరణం రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు. ఎండలు మండకూడదు.
శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది.
వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే.
5. భూమి స్వభావం ముఖ్యమే!
- రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత ధృడంగా ఉండాలి.
- శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత ధృడంగా ఉంటుంది.
- రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్‌కు ఉన్న అరుదైన అవకాశం.
- శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది'రాకెట్ ప్రయోగాల కోట' అయింది.
- నిజానికి అంతరిక్ష పరిశోధనా ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబలో ఏర్పాటు చేశారు.
- తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రంగా ఉన్న తుంబ, తర్వాత పూర్తిస్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది.
0 Response to "Why rockets are launched from Srihari Kota ?"
Post a Comment