Diabetes: No more tension..sweet news for sugar patients..AIIMS sensational report.
Diabetes: ఇక నో టెన్షన్..షుగర్ పేషెంట్లకు తీపి వార్త..ఎయిమ్స్ సంచలన రిపోర్ట్.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలోనే అత్యధికమంది డయాబెటిస్ లేదా మధుమేహ పేషెంట్లు ఉంటారు. 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు భారత్ లో ఉన్నారు.
అందుకే మన దేశాన్ని డయాబెటిస్ వరల్డ్ అని కూడా అంటారు. రక్తంలో చక్కెర పెరుగుదల కారణంగా ఈ వ్యాధి వస్తుంది. డయాబెటీస్ ఒక్కసారి అటాక్ అయ్యిందంటే దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేసే మెడిసిన్ ఇప్పటిదాకా లేదు. ఈ వ్యాధిని కేవలం నియంత్రించగలం అంతే. అయితే ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు మధుమేహంపై చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యోగా ద్వారా మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చని ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. రోజుకు 50 నిమిషాల పాటు యోగా చేస్తే షుగర్ లెవల్స్ అదుపులో ఉంచచ్చని ఈ పరిశోధనలో తేలింది. ఎయిమ్స్ సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడికల్ సైన్సెస్,ఇతర డిపార్ట్ మెంట్ ల డాక్టర్లు కలిసి ఈ పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కి షుగర్ కంట్రోల్ మందులతో పాటు యోగా..మరో గ్రూపు వ్యక్తులకు మెడిసిన్స్ మాత్రమే ఇచ్చారు. మూడు నెలల పాటు ఇలా పరీక్షించి చూడగా.. యోగా చేయని వారి కంటే మెడిసిన్ వాడుతూ యోగా చేసిన వారి షుగర్ లెవెల్స్ వేగంగా అదుపులో ఉన్నాయని పరిశోధనలో తేలింది. యోగా ద్వారా HBA1C లెవల్స్ ని నియంత్రించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ఈ పరిశోధన వివరాలను ఉంచారు.
యోగా అందరికీ ప్రయోజనకరమని
సాక్షాత్తూ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పలు సందర్భాలలో చెప్పారు. ఇప్పుడు షుగర్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేయగలదని పరిశోధనలు రుజువు చేశాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో యోగాను చేర్చుకోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు కొత్తగా లేదా ప్రెష్ గా యోగా ప్రారంభించేటట్లయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తీవ్రమైన అనారోగ్యం ఉంటే యోగా ప్రారంభించే ముందు డాక్టర్ ని సంప్రదించండి. మీ శరీరానికి అనుగుణంగా యోగా చేయండి.
డయాబెటిస్ ను నియంత్రించే కొన్ని ఆసనాలు
మకరాసనం
మకర అంటే మొసలి. ఈ భంగిమ కూడా మొసలి ఆకారంలోనే ఉంటుంది. అందుకే దీన్ని మకరాసనం అంటారు. ఈ ఆసనడం వేయడం వల్ల బరువు కూడా తగ్గొచ్చు. డయబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది.
భుజంగాసనం
దీనిని కోబ్రా పోజ్ లేదా సర్పాసనం అని కూడా అంటారు. డయాబెటిస్ ను నియంత్రించడంలో భుజంగాసనం చాలా బాగా పని చేస్తుంది. డయాబెటిస్ తో బాధ పడేవారు తరచూ ఈ ఆసనం వేయడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
ధనురాసనం
దీనిని విల్లు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం కూడా మధుమేహ నియంత్రణకు హెల్ప్ అవుతుంది.
పశ్చిమోత్తనాసనం
ఇన్సులిన్ ఉత్పత్తికి బాధ్యత వహించే ప్యాంక్రియాస్ వంటి ఉదర అవయవాలను ఉత్తేజపరచడంలో పశ్చిమోత్తనాసనం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది.
0 Response to "Diabetes: No more tension..sweet news for sugar patients..AIIMS sensational report."
Post a Comment