New ration cards for whom, cancellation of old ones - application procedure.
కొత్త రేషన్ కార్డులు వీరికే, పాతవి రద్దు - దరఖాస్తు విధానం.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు మంజూరుకు నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డులతో పాటుగా మార్పుల కు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
పాత కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి ఇవ్వను న్నారు. ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సంక్రాంతి వేళ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు కీలకం కానుండటంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
నేటి నుంచి దరఖాస్తులు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలో లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. వైసీపీ హయాంలో నే భారీగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చే సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కానుంది. పాత రేషన్ కార్డులు వైసీపీ రంగుల్లో ఉండటంతో వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త డిజైన్లతో, రాజముద్రతో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు.దరఖాస్తులకు భారీ స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు (మంగళవారం) జరిగే మంత్రివర్గ సమావేశంలో అర్హతలు ఖరారు చేసే ఛాన్స్ ఉంది.
పథకాలకు కార్డే ఆధారం
రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అదే విధంగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఈ రోజు నుంచి అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు కానున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రతిపాదిక కావటంతో పథకాల లబ్దిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే గా బియ్యం కార్డు కలిగి ఉండాలి.
ఈ నెల 28 వరకు సమయం
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేసారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం దక్కలేదు. దీంతో, మార్పులు.. కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వటంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా డిసెంబర్ 28వ తేదీ వరకూ రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
0 Response to "New ration cards for whom, cancellation of old ones - application procedure."
Post a Comment