8th Pay Commission
8th Pay Commission: ఉద్యోగులకు గుడ్ న్యూస్..రెండింతలు పెరగనున్న జీతాలు?
8th Pay Commission: 7వ వేతనం సంఘం అమల్లోకి వచ్చిన దాదాపు 10ఏళ్ల తర్వాత 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ వేతన సంఘంపై ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం.
2025 కొత్త ఏడాది సందర్భంగా 8వ పే కమిషన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ సంఘం 2025లో ఏర్పాటు అయితే 2026 నుంచి పెరిగిన జీతాలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు నుంచి ఊహించని విధంగా వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ 8వ వేతన సంఘం ఏర్పాటుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే 8వ వేతన సంఘం అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రులు చర్చించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వార్తలను ఖండించింది. ఇందులో వాస్తవం లేదని..ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది.
నిరాధారమైన వార్తలు అయినప్పటికీ గతంలో రాజ్యసభ చర్చల ద్రుష్ట్యా ఉద్యోగుల ఆశలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. త్వరలోనే 8వ వేతన సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇక అధికారిక సమాచారం త్వరలోనే ప్రవేశపెట్టనున్న 2025-26 యూనియన్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కమిషన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పెద్దగా లబ్దిపొందే అవకాశం ఉంటుంది. జీతాలు 186శాతం వరకు పెరగవచ్చేనే అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక సాధారణ ఉద్యోగి బేసిక్ సాలరీ 18వేలు అనుకుంటే కొంత వేతన సంఘం ప్రకారం అది దాదాపు 34, 560 వరకు పెరుగుతుంది. ఇక పెన్షన్ కూడా 17,280కి పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం అందించినట్లు సమాచారం. 2025లో ఈ కమిషన్ అమలుకై చర్యలు తీసుకుంటే 2026లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లో గణనీయమైన పెరుగుదల చూసే అవకాశం ఉంటుంది.
0 Response to "8th Pay Commission"
Post a Comment