Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet meeting Highlights

AP Cabinet: ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

AP Cabinet meeting Highlights

ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది.

భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ అధికారంపై సమావేశంలో చర్చ జరిగింది. అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 

రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు. నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం అంగీకారం తెలపనుంది. చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణ కు ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే… మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం 14 అంశాల పై ఏపీ కేబినెట్ భేటీ కొనసాగింది. 19 నూతన పోస్టులకు అనుమతి తెలిందని అంటున్నారు.

నేటి(02 జనవరి) కేబినెట్ నిర్ణయాలు

పిఠాపురం ఏరియా డెవలప్‌ మెంట్‌ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

కేబినెట్ ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 

పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 

తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి పడకలను 100కి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటుపై కేబినెట్ మీటింగ్లో చ‌ర్చించారు. 

అలానే చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై క్యాబినెట్‌లో చ‌ర్చ జ‌ర‌గింది.

నంద్యాల, వైఎస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.

ఎస్‌ఐపిబి అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ అమోదం తెల‌పింది. ఈ పెట్టుబడులు వ‌ల‌న 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. 

నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్న‌ల్. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది. 

మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు.

విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ. 80 కోట్ల పెట్టుబడుల‌కు అమోదం తెలిపింది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. 

 శ్రీ సత్యసాయి జిల్లా, గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడిల‌కు క్యాబినెట్ ఓకే చెప్పింది. దీని ద్వారా 2,381 మందికి ఉపాధి కలుగనుంది

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబ‌డుల‌కు , ది. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎన‌ర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. 

 వీటితోపాటు సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్టుపై క్యాబినెట్‌లో చ‌ర్చించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet meeting Highlights"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0