DA Announcement
DA Announcement: ఉద్యోగులకు సంక్రాంతి కానుక, రెండు డీఏల ప్రకటన.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయనేది ఉద్యోగుల ఆశగా ఉంది. అందుకు తగ్గట్టే ప్రభుత్వం రేపు కీలకమైన ప్రకటన చేయవచ్చని సమాచారం.
ఉద్యోగులకు సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. ఆ వివరాలు మీ కోసం.
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే నెల మొదటి రోజే వేతనాలు చెల్లిస్తూ ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని వరాలు ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించనున్నారు. సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో రేపు మంత్రిమండలి సమావేశముంది. ఈ భేటీలో రెండు డీఏలు ప్రకటించవచ్చి తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలతో పాటు పీఆర్సీ, ఐఆర్‌పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. నెలకు రెండుసార్లు ఏపీ కేబినెట్ సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు రేపు ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ జరగనుంది. సంక్రాంతి కానుకగా రెండు డీఏలు ప్రకటించవచ్చు.
0 Response to "DA Announcement"
Post a Comment