Bima Sakhi Yojana
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందగలరు.
మహిళల కోసం ప్రత్యేకంగా ఎల్‌ఐసీ బీమా సఖీ పథకాన్ని (Bima Sakhi Yojana) కేంద్రం ఇటివల ప్రారంభించింది. ఈ స్కీం ప్రధాన లక్ష్యం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం, మహిళల్లో బీమా అవగాహన పెంచడం, బీమా కోసం వారిని ప్రోత్సహించడం.
మహిళల ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడంతోపాటు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం. ఈ పథకం కింద శిక్షణ సమయంలో మహిళలు రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఆర్థిక సహాయం, కమీషన్ ప్రయోజనం పొందుతారు. అయితే దీని కోసం ఎలా దరఖాస్తు చేయాలి, ఉండాల్సిన అర్హతల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
శిక్షణ తర్వాత
LC బీమా సఖి యోజన స్కీంలో శిక్షణ తర్వాత మహిళలను LIC ఏజెంట్లుగా నియమిస్తారు. గ్రాడ్యుయేట్ మహిళలు కూడా డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా అవకాశం పొందుతారు. ఈ స్కీం కోసం ప్రభుత్వం తొలుత రూ. 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.
వయో పరిమితి
18 నుంచి 70 సంవత్సరాలు
విద్యా అర్హత
కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత
శిక్షణ సమయంలో నెలవారీ స్టైఫండ్:
- మొదటి సంవత్సరం: నెలకు రూ. 7,000
- రెండో సంవత్సరం: నెలకు రూ. 6,000
- మూడో సంవత్సరం: నెలకు రూ. 5,000
మొత్తం ప్రయోజనం: మూడేళ్లలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ, అలాగే విక్రయించిన పాలసీలపై కమీషన్ లభిస్తుంది.
వచ్చే మూడేళ్లలో 2 లక్షల మంది మహిళలకు ఎల్‌ఐసీ ఏజెంట్లుగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యం
మొదటి దశలో 35 వేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు.
శిక్షణలో బీమా, ఆర్థిక సేవల గురించి పూర్తి సమాచారం ఇవ్వబడుతుంది. తద్వారా మహిళలు పాలసీలను సమర్థవంతంగా విక్రయించవచ్చు
దరఖాస్తు చేసుకొనే విధానం
- బీమా సఖి స్కీమ్ కోసం దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్ (https://licindia.in/test2)పై క్లిక్ చేయండి
- ఆ తర్వాత క్లిక్ ఫర్ బీమా సఖి ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- అప్పుడు వచ్చిన ఫారమ్‌ను మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలతో పూరించండి
- దీని తర్వాత వచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి "సమర్పించు"పై క్లిక్ చేయండి
- అప్పుడు మీరు ఆ జిల్లా పరిధిలోకి వచ్చే శాఖల పేర్లను చూస్తారు. మీరు పని చేయాలనుకుంటున్న బ్రాంచ్‌ని ఎంచుకుని "సబ్మిట్ లీడ్ ఫారమ్"పై క్లిక్ చేయండి
- ఫారమ్‌ను సమర్పించిన తర్వాత మీరు స్క్రీన్‌పై సందేశాన్ని చూస్తారు. మీ మొబైల్ నంబర్‌కు నోటిఫికేషన్ కూడా వస్తుంది
- ఇన్సూరెన్స్ ఏజెంట్ పని: బీమా సఖిలు LIC మహిళా కెరీర్ ఏజెంట్‌లుగా మారతారు. బీమా పాలసీలను విక్రయిస్తారు. అందులో వారు వారి సమయానికి అనుగుణంగా పని చేసుకోవచ్చు.
- ఎన్ని పాలసీలు విక్రయించాలి: ప్రతి బీమా సఖీ ఏడాదికి కనీసం 24 పాలసీలను విక్రయించాలి
0 Response to "Bima Sakhi Yojana"
Post a Comment